Viral Video: ఈ వీడియో చూస్తే నవ్వీ నవ్వీ కడుపు నొయ్యడం ఖాయం… ఇలాంటి దృశ్యం ఇంతకు ముందెన్నడు చూసి ఉండరు!

భయం.. మనుషలకే కాదు, జంతువులు, పక్షులకు కూడా ఉంటుంది. తమ ప్రాణాలకు ప్రమాదం ఉందని భావించే ప్రదేశాలకు మనుషులు ఎలా వెళ్లరో జంతువులు, పక్షులు కూడా వెళ్లడానికి భయపడతాయి. ముఖ్యంగా కుక్కలు ఒక్కోసారి ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. కానీ అవి గాజు వంతెన ఎక్కడానికి...

Viral Video: ఈ వీడియో చూస్తే నవ్వీ నవ్వీ కడుపు నొయ్యడం ఖాయం... ఇలాంటి దృశ్యం ఇంతకు ముందెన్నడు చూసి ఉండరు!
Dogs Afraid Climb Glass Bri

Updated on: Nov 01, 2025 | 7:37 PM

భయం.. మనుషలకే కాదు, జంతువులు, పక్షులకు కూడా ఉంటుంది. తమ ప్రాణాలకు ప్రమాదం ఉందని భావించే ప్రదేశాలకు మనుషులు ఎలా వెళ్లరో జంతువులు, పక్షులు కూడా వెళ్లడానికి భయపడతాయి. ముఖ్యంగా కుక్కలు ఒక్కోసారి ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. కానీ అవి గాజు వంతెన ఎక్కడానికి భయపడటం మీరు ఎప్పుడైనా చూశారా? అలాంటి ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూస్తే మీరు ఆశ్చర్యపోవడమే కాదు తెగ నవ్వుకుంటారు. నిజానికి, ఈ వీడియోలో రెండు కుక్కలు తొలిసారిగా గాజు వంతెన ఎక్కడం కనిపిస్తాయి. కానీ అంతకు ముందు అవి ఎదుర్కొనే పరిస్థితిని చూస్తే ఎవరైనా పగలబడి నవ్వుతారు.

వీడియోలో, ఇద్దరు వ్యక్తులు తమ పెంపుడు కుక్కలను గాజు వంతెనపైకి ఎక్కించాలని ప్రయత్నిస్తున్నట్లు మీరు చూడవచ్చు, కానీ కుక్కలు భయపడి గాజుపై తమ పాదాలను పెట్టలేకపోతున్నాయి. ఒక మహిళ తన కుక్క బెల్ట్‌ పట్టీని పట్టుకుని గట్టిగా లాగుతుంది. కానీ ఆ పట్టీ దాని మెడ నుండి జారిపోతుంది. రెండవ కుక్క ఏదో విధంగా గాజు వంతెనపైకి ఎక్కగలిగినప్పటికీ, మొదటి కుక్క చాలా భయపడి ధైర్యం కూడగట్టుకుంది. కానీ గాజుపై కాలు పెట్టడానికి భయపడుతుంది. బదులుగా అది వంతెన వైపు నుండి భయంతో ముందుకు కదులుతుంది. ఈ ఫన్నీ దృశ్యం నెటిజన్స్‌ను ఆకట్టుకుంటుంది.

వీడియో చూడండి:

ఈ ఫన్నీ వీడియోను @TheFigen_ అనే ఖాతా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో షేర్ చేసింది, “గ్లాస్-బాటమ్ బ్రిడ్జిని దాటాలనుకున్న పర్యాటకులు తమ కుక్కలను ఒప్పించలేకపోయారు.” అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు. 36 సెకన్ల ఈ వీడియోను వేల మంది వీక్షించారు. వందల మంది లైక్‌ చేసి కామెంట్స్‌ పెడుతున్నారు.

మనుషులే కాదు, జంతువులు కూడా ఈ వంతెనకు భయపడతాయి అంటూ కొంత మంది కామెంట్స్‌ రాశారు. వాటి పరిస్థితి చూసి నా కాళ్ళు వణుకుతున్నాయి అంటే మరికొందరు పోస్టు పెట్టారు. మానవులు విస్మరించే ప్రమాదాలను జంతువులు పసిగట్టగలవు అంటూ మరికొంత మంది నెటిజన్స్‌ కామెంట్స్‌ పెట్టారు.