
Viral Video: తల్లిదండ్రులకు పిల్లలే గొప్ప సంపద. వెలకట్టలేని ఆస్తి. మనుషుల్లోనైనా, మూగజీవాల్లోనైనా తల్లీబిడ్డల ప్రేమానురాగాలు ఒకేలా ఉంటాయి. పిల్లలు ఆపదలో ఉంటే వారిని రక్షించేందుకు తల్లిదండ్రులు ఏమైనా చేస్తారనడానికి ఈ వీడియో నిదర్శనం. కొలనులో పడిన పిల్ల ఏనుగును రెండు ఏనుగులు రక్షించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యానిమల్ లవర్స్, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ వీడియోను గాబ్రియేల్ కార్నో అనే వ్యక్తి ట్విట్టర్‌లో షేర్ చేశాడు. ఈ వీడియోలో, తల్లి ఏనుగు, పిల్ల ఏనుగు జూలో ఏర్పాటుచేసిన ఓ కొలనులో నీరు తాగడానికి వెళతారు. అయితే దాహం తీర్చుకునే క్రమంలో ప్రమాదవశాత్తు కొలనులో పడిపోతుంది పిల్ల ఏనుగు. దానిని రక్షించుకొందుకు పెద్ద ఏనుగు అనేక ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఎలాంటి ఫలితముండదు. ఇంతలో పక్కనే ఉన్న మరో పెద్ద ఏనుగు అక్కడికి వస్తుంది. ఇద్దరూ కలిసి కొలనులోకి దిగుతారు. ఈత రాక కొట్టుమిట్టాడుతోన్న పిల్ల ఏనుగును బయటకు లాక్కొస్తాయి.
కాగా ఈ సంఘటన దక్షిణ కొరియా రాజధాని సియోలోని ఓ జూపార్క్‌లో జరిగినట్లు తెలుస్తోంది. ఈ వీడియోను షేర్ చేసిన కొద్దిగంటల్లోనే లక్షల మంది వీక్షించారు. వేలాదిమంది లైక్‌లు, కామెంట్ల వర్షం కురిపించారు. మనుషుల కంటే మూగజీవాలు ఎంతో గొప్పవి. పిల్లలను కాపాడుకునేందుకు అవి ఎంతకైనా తెగిస్తాయి అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి అందరి మెప్పు పొందిన ఈ వైరల్ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
In the Seoul zoo, two elephants rescued baby elephant drowned in the pool pic.twitter.com/zLbtm84EDV
— Gabriele Corno (@Gabriele_Corno) August 13, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..