Viral Video: మానవత్వం కంటే ప్రపంచంలో ఏదీ గొప్పది కాదని మనలో ప్రతి ఒక్కరికి బాగా తెలుసు. తమకు అవకాశం దొరికినప్పుడల్లా, ఏదైనా సందర్భంలో అవసరమైన వారికి సహాయం చేయాలని చాలామంది అనుకుంటూనే ఉంటుంటారు. అయితే నెట్టింట్లో ఇలాంటి ఎన్నో వీడియోలు మనకు కనిపిస్తూనే ఉంటుంటాయి. వాటిలో కొన్ని మాత్రం తెగ నచ్చుతుంటాయి. ఇలాంటి వాటిలో మరో వీడియో చేరింది. ఒక వ్యక్తి తన దాతృత్వం కారణంగా సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో, ఒక వృద్ధుడు వీధి కుక్కకు ఆహారం ఇస్తున్నట్లు చూడవచ్చు. వీడియోలో కనిపిస్తున్న వృద్ధుడి దగ్గర సైకిల్‌పై కుండ ఉంది. అతను కుండలో నుంచి వేడి అన్నం తీసి నేలపై ఉంచాడు. కుక్క చాలా ఆనందంగా తినడం కనిపిస్తుంది. ఈ వీడియో చూసిన వారంతా ఆ వృద్ధుడి మంచి మనసును మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఈ క్లిప్‌ను ఐపీఎస్ అధికారి దీపాంశు కబ్రా ట్విట్టర్లో షేర్ చేశారు. దీపాంశు కబ్రా వీడియో క్యాప్షన్‌లో ‘నేను అతను పొడి రోటీ తినడం చూశాను. రోడ్డుపై కూర్చున్న ఆధ్యాత్వికవేత్తలా కనిపించాడు. తనలో ఉన్న రాజును బయటకు తీశాడు. భగవంతుడు ప్రతి ఒక్కరినీ మరొకరికి సహాయం చేయగల సామర్థ్యాన్ని అందించాడు. తాతగారి ఈ వీడియో బహుశా మనకు అదే సందేశాన్ని ఇస్తోంది” అంటూ రాసుకొచ్చారు. దీంతో ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది.
ఆన్‌లైన్‌లో షేర్ చేసిన తర్వాత, వీడియోను 41 వేలకు పైగా వీక్షించారు. ఈ వయస్సులో కూడా చాలా దయ చూపించిన తాతను చూస్తుంటే గర్వగా ఉంది అంటూ ఓ యూజర్ కామెంట్ చేయగా, తాతా.. నీకు హ్యాట్సాఫ్ అంటూ మరొక యూజర్ కామెంట్ చేశాడు.
सूखी रोटी बांट के खाते हुए देखा उसे मैंने,
सड़क किनारे बैठा फकीर, बादशाह निकाला!
~ अज्ञात.ईश्वर ने सभी को इस काबिल बनाया है कि किसी ना किसी की मदद कर सकें. दादाजी का यह वीडियो शायद हमें यही संदेश दे रहा है.#HelpChain #Kindness #humanitywithheart pic.twitter.com/Q4u38RQ9Zg
— Dipanshu Kabra (@ipskabra) February 11, 2022
Also Read: Viral Video: అత్యుత్సాహం కొంప ముంచింది.. క్షణాల్లో తుక్కుతుక్కయిన బైక్, షాకింగ్ వీడియో..
Viral Video: చిరుతపులిని ఎదురించిన కుక్క.. దాని అరుపులకు తోకముడిచిన చిరుత.. వీడియో వైరల్