
Train Viral Video: ఒక డేగ రైలును ఢీకొట్టి, విండ్ షీల్డ్ ను పగలగొట్టి డ్రైవర్ క్యాబిన్ లోకి ప్రవేశించిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనలో రైలు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. రైలును వెంటనే ఆపాల్సి వచ్చింది. శ్రీనగర్- అనంతనాగ్ మధ్య నడుస్తున్న రైలులో ఈ సంఘటన జరిగింది. రైలు కదులుతున్నప్పుడు ఒక డేగ రైలు విండ్ షీల్డ్ ను ఢీకొట్టింది. దీంతో రైలు విండ్ షీల్డ్ ను పగిలిపోయింది. ఆ డేగా రైలును ఢీకొట్టి నేరుగా డ్రైవర్ క్యాబిన్‌లోకి దూసుకెళ్లింది. డ్రైవర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. వీడియోలో అతని ముఖంపై గాయాలు, రక్తస్రావం అయ్యింది.
ఇది కూడా చదవండి: Gold Price: దిగి వస్తున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతో తెలుసా?
రైలులోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ తీవ్రమైన సంఘటన కారణంగా రైలును వెంటనే ఆపి, డ్రైవర్‌కు ప్రథమ చికిత్స అందించారు. గాయపడిన గద్ద రైలులో పడి ఉన్నట్లు వీడియోలో కనిపిస్తోంది. అదృష్టవశాత్తూ రైలులో ఉన్న ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారు. డ్రైవర్ చెప్పిన దాని ప్రకారం, డేగ ఢీకొన్న తర్వాత గాజు చాలా తీవ్రంగా పగిలిపోయింది. దాని ముక్కలు అతని మెడ, ముఖంపై గుచ్చుకున్నాయి. దీనివల్ల రక్తస్రావం జరిగింది. అకస్మాత్తుగా రైలు ఆగిపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
जम्मू-कश्मीर के अनंतनाग जिले में एक चलती हुई ट्रेन की खिड़की से चील टकरा गई,टक्कर इतनी जोरदार थी कि चील विंड स्क्रीन तोड़ती हुई सीधे लोको पायलट से टकराई उसके साथ ही कांच के कुछ टुकड़े भी लोको पायलट से लगे, जिसकी वजह से वह मामूली रूप से जख्मी हो गया
बारामूला- बनिहाल ट्रेन की घटना pic.twitter.com/7aRUbqCXUf— 🇮🇳Siya Ram 🚩 (@Jisiyaram) November 8, 2025
ఇది కూడా చదవండి: Petrol Pump: పెట్రోల్ పంపు యజమాని ఎంత సంపాదిస్తాడు? లీటరుకు ఎంత కమీషన్? నెలవారీ ఆదాయం!
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి