Unique Theme: మార్కెట్‌లో విచిత్ర క్లచ్‌లు హల్ చల్.. జుట్టుకు పెట్టుకోడానికా… చూడడానికా అంటున్న నెటిజన్లు..

|

Jun 10, 2024 | 5:42 PM

కొందరు వివిధ ఫ్యాషన్ లతో ప్రజల ముందుకు వచ్చినప్పుడు ఆశ్చర్యపోవడానికి కారణం ఇదే. ఈ రోజుల్లో ఇలాంటివి జనాల్లో వార్తల్లో నిలుస్తారు. కట్టుకునే బట్టల నుంచి జుట్టుకు పెట్టుకునే క్లచర్లు వరకూ విభిన్నంగా ఉంటాయి.. కొన్ని సార్లు ఈ ఫ్యాషన్ల చూసి షాక్ తింటారు. కొన్ని సార్లు భయపడతారు కూడా..ప్రతి వ్యక్తి అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలని కోరుకుంటాడు. జుట్టు ఇందులో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా అమ్మాయిల గురించి మాట్లాడినట్లయితే జుట్టు విషయంలో అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువ శ్రద్ధ చూపుతారు

Unique Theme: మార్కెట్‌లో విచిత్ర క్లచ్‌లు హల్ చల్..  జుట్టుకు పెట్టుకోడానికా... చూడడానికా అంటున్న నెటిజన్లు..
Different Clutches
Image Credit source: Instagram
Follow us on

ప్రస్తుతం ఫ్యాషన్ ప్రపంచం నడుస్తోంది. అయితే ప్రతి ఒక్కరికి ప్యాషన్ గురించి అవగాహన ఉండదు. ప్యాషన్ గురించి అవగాహన ఉన్నవారు నేటి ట్రెండ్ ను కొంచెం భిన్నంగా ఉంటారు. అలాంటి వారు ఫ్యాషన్ ప్రపంచంలో అడుగు పెట్టినప్పుడు.. లేదా కొందరు వివిధ ఫ్యాషన్ లతో ప్రజల ముందుకు వచ్చినప్పుడు ఆశ్చర్యపోవడానికి కారణం ఇదే. ఈ రోజుల్లో ఇలాంటివి జనాల్లో వార్తల్లో నిలుస్తారు. కట్టుకునే బట్టల నుంచి జుట్టుకు పెట్టుకునే క్లచర్లు వరకూ విభిన్నంగా ఉంటాయి.. కొన్ని సార్లు ఈ ఫ్యాషన్ల చూసి షాక్ తింటారు. కొన్ని సార్లు భయపడతారు కూడా..

ప్రతి వ్యక్తి అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలని కోరుకుంటాడు. జుట్టు ఇందులో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా అమ్మాయిల గురించి మాట్లాడినట్లయితే జుట్టు విషయంలో అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువ శ్రద్ధ చూపుతారు. ఈ కారణంగానే మార్కెట్‌లో వివిధ రకాల హెయిర్‌ యాక్సెసరీలు వస్తూనే ఉన్నాయి. ఇటీవలి కాలంలో కూడా కొన్ని విచిత్రమైన ప్రింట్లతో క్లచ్‌ల వీడియోలు బయటకు వచ్చాయి. ఇందులో గుండె, కాలిక్యులేటర్, కంప్యూటర్ వంటి క్లచ్‌లు కూడా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి

వీడియోలో ఒక మహిళ వివిధ రకాల క్లచేస్ ను చూపిస్తోంది. వీటిని చూసిన తర్వాత ఈ క్లచర్లు మార్కెట్‌లోకి ఎలా వచ్చాయా అని ఫీల్ అవుతారు. @artistcolette అనే ఖాతాలో షేర్ చేసిన ఈ వీడియో ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఈ వీడియోను లక్షలాది మంది చూడగా.. వేలాదిగా కామెంట్ చేస్తున్నారు.

ఈ వీడియోను చూసిన తర్వాత ఒకరు ‘ఈ డిజైన్‌ను అనారోగ్యంతో ఉన్న వ్యక్తి తయారు చేసినట్లు భావిస్తున్నాను’ అని కామెంట్ చేయగా.. మరొకరు ‘ఈ క్లచ్‌ల డిజైన్ అద్భుతంగా ఉందనడంలో సందేహం లేదు.. అయితే ఎవరైనా వీటిని మొదటిసారి చూస్తే.. గందరగోళానికి గురవుతాడు’ అని వ్యాఖ్యానించారు. మరొకరు ఈ వీడియోపై వ్యాఖ్యానిస్తూ, ‘ఈ క్లచ్‌లను డిజైన్ చేసిన వారు ఖచ్చితంగా ఇంజనీర్‌ అయి ఉండాలి’ అని రాశారు. మరొకరు ఈ క్లచర్‌లను జుట్టులో వేసుకోవాలా లేదా ఇంట్లో ఉంచుకోవాలా’ అని రాశారు. ఏది ఏమైనప్పటికీ ఈ వీడియో క్లచ్‌ల డిజైన్ల పై రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

 

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..