Viral Video: మొసలినా మజాకా.. ముప్పతిప్పలు పెట్టిందిగా.. వీడియో చూస్తే..

ముంబైలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇలానే నగర సమీపంలోని ఓ చెరుకు నుంచి వరద పోటెత్తడంతో చెరువులో ఉన్న ఓ మొసలి.. నీటి ప్రవాహనాకి నగరంలోకి కొట్టుకొచ్చింది. దాన్ని చూసి తీవ్ర భయాందోళనకు గురైన స్థానికులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో.. వాళ్లు దాన్ని సురక్షితంగా బంధించి తీసుకెళ్లారు.

Viral Video: మొసలినా మజాకా.. ముప్పతిప్పలు పెట్టిందిగా.. వీడియో చూస్తే..
Mumbai Crocodile Rescue

Updated on: Jul 07, 2026 | 8:47 PM

దేశ ఆర్థిక రాజధాని ముంబైను వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల కారణంగా ముంబయి వీధులు మొత్తం జలమయం అయిపోయాయి. అయితే ఈ వరదకు కొన్ని జల చరాలు కూడా నగరంలోకి కొట్టుకొని వచ్చాయి. ఇలానే ఓ మొలసి కొట్టుకురావడంతో గమనించిన స్థానికులు అధికారులు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న అధికారులు దాన్ని సురక్షితంగా బంధించి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

విరాల్లోకి వెళ్తే.. గత కొన్ని రోజులుగా ముంబై నగరంలో వర్షాలు దంచికొడుతున్న ఈ భారీ వర్షాల కారణంగా నగరం సమీపంలోని పొవాయ్ సరస్సు నుంచి వరద పొటెత్తింది. దీంతో ఆ సరస్సులో ఉన్న ఓ మొసలి నీటితో పాటు కొట్టుకొని ఎన్‌ఐటీఐఈ ప్రాంతంలోకి వచ్చింది. దాన్ని గమనించిన కొందరు వీడియో తీసి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అలాగే అటవీశాఖ అధికారులను సైతం ట్యాగ్ చేస్తూ దీన్ని బంధించాలని కోరారు.ఈ వీడియో వైరల్ కావడంతో వెంటనే స్పందించిన బీఎంసీ అధికారులు, లొకేషన్‌ను తెలుసుకుని వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. దాదాపు గంటపాటు తీవ్రంగా శ్రమించి ఎవరికీ ఎలాంటి గాయాలు కాకుండా ఎట్టకేలకు మొసలిని సురక్షితంగా పట్టుకున్నారు. అనంతరం దానిని అక్కడి నుంచి జూకు తరలించారు.

అయితే ఈ పొవాయ్ సరస్సు పరిసరాల్లో మగ్గర్ జాతికి చెందిన మంచినీటి మొసళ్లు ఉంటాయని వన్యప్రాణి నిపుణులు చెబుతున్నారు. భారీ వర్షాలు కురిసినప్పుడు సరస్సులు, కాలువలలో నీటి మట్టం విపరీతంగా పెరుగుతుందని.. ఈ వరద నీటి ప్రవాహానికి మొసళ్లు తమ నివాస ప్రాంతాల నుండి కొట్టుకువచ్చి రోడ్లు, నివాస ప్రాంతాలు లేదా విద్యాసంస్థల క్యాంపస్‌లలోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. జనాలు ఎక్కడైనా ఇలాంటి వాటిని గుర్తిస్తే.. వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us