Viral Video: ఏఐ టెక్నాలజీని ఇట్ల కూడా వాడొచ్చా… మీ తెలివికి దండంరా బాబు..

ఇప్పుడంతా ఆర్టిఫిషియల్‌ యుగం నడుస్తోంది. అన్ని రంగాల్లో ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఏఐని రోజువారీ జీవితంలో ఉపయోగించడానికి సృజనాత్మకమైన, ఆశ్చర్యకరమైన మార్గాలను కనుగొంటున్నారు. ఈ-మెయిల్‌లు రాయడానికి, గణిత సమస్యలను పరిష్కరించడానికి ఏఐ చాట్‌బాట్‌లను ఉపయోగించడం విద్యార్థులకు రోజువారీ పనిగా మారింది. భారతదేశంలో ప్రాంతానికి...

Viral Video: ఏఐ టెక్నాలజీని ఇట్ల కూడా వాడొచ్చా... మీ తెలివికి దండంరా బాబు..
Auto Passenger Ai Technolog

Updated on: May 13, 2025 | 5:12 PM

ఇప్పుడంతా ఆర్టిఫిషియల్‌ యుగం నడుస్తోంది. అన్ని రంగాల్లో ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఏఐని రోజువారీ జీవితంలో ఉపయోగించడానికి సృజనాత్మకమైన, ఆశ్చర్యకరమైన మార్గాలను కనుగొంటున్నారు. ఈ-మెయిల్‌లు రాయడానికి, గణిత సమస్యలను పరిష్కరించడానికి ఏఐ చాట్‌బాట్‌లను ఉపయోగించడం విద్యార్థులకు రోజువారీ పనిగా మారింది.

భారతదేశంలో ప్రాంతానికి అనుగుణంగా ప్రాంతీయ భాషలు ఉంటాయి. అయితే చదువుకున్న వారు ఇంగ్లిష్‌తో కమ్యూనికేట్ చేసుకున్నా డ్రైవర్లు వంటి వారికి మనం ఏం చెబతున్నామో? అర్థం కాదు. ఈ నేపత్యంలో ఓ ఔత్సాహికుడు ఆటో డ్రైవర్‌తో ఏఐ సాయంతో సంభాషణ స్టార్ట్ చేశాడు.

కర్ణాటకలో ఒక కంటెంట్ సృష్టికర్త కన్నడ భాషలో ఆటో ఛార్జీలను బేరసారాలు చేయడానికి ఏఐను ఉపయోగించాడు. ఈ వీడియోను బెంగళూరులో చిత్రీకరించారు. ముఖ్యంగా ఏఐ వాయిస్ ఫీచర్ సాయంతో ఆటో డ్రైవర్ కిరాయి రూ.200 చెబితే దాన్ని రూ.100 తగ్గించాలని కోరాడు. తాను విద్యార్థినని, తరచూ ఇదే దారిలో వెళ్తాను అని కన్నడలో ఏఐ వాయిస్ ఫీచర్‌ సాయంతో అనువదించాడు. ఇలా క్రమేపి ఆటో డ్రైవర్ కిరాయిను రూ.120కు ఫైన్ చేశాడు. ఈ వీడియోపై నెటిజన్లను మిశ్రమంగా స్పందిస్తున్నారు. క్షణాల్లో ఈ వీడియో వైరల్ అయ్యింది.

 

 

వీడియో చూడండి: