VIRAL VIDEO : వన్యప్రాణులకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. వీటిని చూసిన జనాలు మంచి అనుభూతికి లోనవుతారు. ఈ వీడియోలు కొన్నిసార్లు ఫన్నీగా కూడా ఉంటాయి. మరొకొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అడవి జంతువులను దగ్గరగా చూసే అవకాశం చాలా తక్కువ. సోషల్ మీడియా ద్వారా ఆ అవకాశం వచ్చినప్పుడు ఆ వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోను ఐపీఎస్ అధికారి రూపిన్ శర్మ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో హల్‌చల్ చేస్తుంది. అదేంటో తెలుసుకుందాం.
ఈ వీడియోలో ఊసరవెల్లి దాని రంగును ఒకసారి రెండు సార్లు కాకుండా ఏకంగా 8 సార్లు మారుస్తుంది. వీడియో ప్రారంభంలో ఊసరవెల్లి గులాబీ రంగులో కనిపిస్తుంది. తర్వాత ఆకుపచ్చగా మారుతుంది. తర్వాత నీలం, కుంకుమ వంటి అనేక రంగులను చూస్తారు. జనాలు ఈ వీడియోను వీక్షిస్తున్నప్పుడు అలాగే చూస్తూ ఉండిపోతారు. ఊసరవెల్లి స్వభావం ఎలా ఉంటుందో ఈ వీడియో ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. ఈ ఆశ్చర్యకరమైన వీడియోను రూపీన్ శర్మ తన ట్విట్టర్ ఖాతా నుంచి షేర్ చేసారు. ఈ వీడియోను విక్రమ్ పోనప్ప చిత్రీకరించారని తెలిపారు. రూపీన్ శర్మ ఈ వీడియోను పూర్తి స్క్రీన్‌లో చూడాలని వినియోగదారులకు సలహా ఇచ్చారు. మరింత సమాచారం కావాలంటే ప్రసిద్ధ ఆర్కిటెక్ట్, ఫోటోగ్రాఫర్ విక్రమ్ పోనప్పని అడగవచ్చన్నారు. రూపిన్ శర్మ మాదిరిగా ఈయన కూడా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. అతను తరచూ తన ట్విట్టర్ ఖాతాలో ఫన్నీ వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటాడు.
Ever seen a #chameleon change its colours?
Watch beautifully shot video by #VikramPonappa of #Bengaluru, – chameleon change its colours seven times!
Please watch in full screen.@susantananda3 @ParveenKaswan @SudhaRamenIFS pic.twitter.com/JHY6fSBUCd
— Rupin Sharma IPS (@rupin1992) June 30, 2021