Viral Video: అక్క పెళ్ళిలో చెల్లెలు సందడి.. బిజిలీ బిజిలీ సాంగ్ కు డ్యాన్స్.. నెట్టింట్లో వీడియో వైరల్..

Viral Video:హిందూ క్యాలెండర్(Hindu Calendar) లో ఇప్పుడు మాఘమాసం(Maghamasam) నడుస్తోంది. దీంతో మన దేశ వ్యాప్తంగా భారీగా పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. ఇక పెళ్లిళ్ల సీజన్ మొదలయ్యిందంటే..

Viral Video: అక్క పెళ్ళిలో చెల్లెలు సందడి.. బిజిలీ బిజిలీ సాంగ్ కు డ్యాన్స్.. నెట్టింట్లో వీడియో వైరల్..
Viral Video

Updated on: Feb 12, 2022 | 3:01 PM

Viral Video: హిందూ క్యాలెండర్(Hindu Calendar) లో ఇప్పుడు మాఘమాసం(Maghamasam) నడుస్తోంది. దీంతో మన దేశ వ్యాప్తంగా భారీగా పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. ఇక పెళ్లిళ్ల సీజన్ మొదలయ్యిందంటే.. పెళ్లి వేడుక సమయంలో జరిగే ఫన్నీ సన్నివేశాలు, సందడి సరదా వీడియోలతో ఇంటర్నెట్ నిండిపోతుంది. ఇక మన పెళ్ళిళ్ళలో ముఖ్యంగా ఉత్తరాదిన జరిగే పెల్లివేడుకలో బరాత్ తప్పని సరి. ఆకట్టుకునే సాంగ్స్ కి యువత చేసే డ్యాన్స్ అందరినీ ఆకర్షిస్తాది కూడా. అలాంటి డ్యాన్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది హార్డీ సంధు ‘బిజిలీ బిజిలీ’ సాంగ్. ఈ సాంగ్ కు వధువు సోదరి అద్భుతంగా డ్యాన్స్ చేసింది. ఈ వీడియోలో డ్యాన్స్ చేస్తున్న అమ్మాయి నికితా కపూర్‌గా తెలుస్తోంది. తన సోదరి పెళ్ళికి బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్‌లతో సూపర్‌హిట్ సాంగ్ కు ఆకట్టుకునే విధంగా డ్యాన్స్ చేసింది. అందమైన లెహంగా ధరించి, మంచి ఎనర్జీతో హుషారైన స్టెప్పులు, సాంగ్ కు తగిన భావాన్ని పలికిస్తూ.. ఓ రేంజ్ లో డ్యాన్స్ చేసింది. నికితా డ్యాన్స్ చేస్తూంటే.. చుట్టూ ఉన్న అతిధులు ఉత్సాహపరిచారు.

ఫ్యాబ్‌వెడ్డింగ్ అనే వినియోగదారుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో పోస్ట్ చేశారు. హుషారుగా వధువు సోదరి.. ఈ శక్తి ఏమిటి..? అంటూ కామెంట్ జతచేశారు. నికిత డ్యాన్స్ నెటిజన్లను అమితంగా ఆకర్షిస్తోంది. ఈ వీడియో 15,735 కంటే ఎక్కువ లైక్‌లతో వైరల్‌గా మారింది. నికితా అద్భుతమైన డ్యాన్స్ ను, ఎనర్జీకి నెటిజన్లు ఫిదా అయ్యారు. ప్రేమ , ఇష్టం, ఎమోజీలతో కొందరు, ‘వావ్’ , ‘అద్భుతం’ వంటి వ్యాఖ్యలతో ఇంకొందరు నెటిజన్లు నికితా డ్యాన్స్ కు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Also Read: Collector Marraige: ఆదర్శ కలెక్టర్‌..ఆర్టీసీ బస్సులో పెళ్లి మండపానికి.. సజ్జనార్ ప్రశంసలు