Viral Video: తగ్గేదే లే.. పెళ్లి వేదికపై ‘పుషప్స్‌’తో అదరగొట్టిన వధువు.. కండలు చూపెడుతూ..!

Viral Video: ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో పెళ్లి వేడుకలకు సంబంధించి వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వాటిల్లో వధూ వరులకు సంబంధించిన

Viral Video: తగ్గేదే లే.. పెళ్లి వేదికపై ‘పుషప్స్‌’తో అదరగొట్టిన వధువు.. కండలు చూపెడుతూ..!
Bride
Follow us
Shiva Prajapati

| Edited By: Ravi Kiran

Updated on: Apr 16, 2022 | 7:05 AM

Viral Video: ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో పెళ్లి వేడుకలకు సంబంధించి వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వాటిల్లో వధూ వరులకు సంబంధించిన సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటున్నాయి. వధూ వరుల డ్యాన్స్, స్టంట్స్, అల్లరి చేష్టలు ఇలా రకరకాల వీడియోలో నెటిజన్లు బాగా ఆకర్షిస్తున్నాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

ప్రస్తుత కాలంలో అబ్బాయిలతో పాటు అమ్మాయిలూ శరీర సౌష్టవం, ఫిట్‌నెస్‌పై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. అబ్బాయిలతో సమానంగా జిమ్‌ లకు వెళ్లి కసరత్తులు చేస్తున్నారు. అయితే, తాజాగా ఓ పెళ్లి వేడుకలో వధువు తన ఫిట్‌నెస్‌ను ప్రదర్శించింది. పెళ్లి వేదికపైనే చేతి కండలను చూపుతూ హల్‌చల్ చేసింది. పెళ్లి దుస్తులు ధరించి వేదికపై నిల్చున్న వధువు ఒక్కసారిగా నేలపై పడుకుని పుషప్స్ తీసింది. ఆ వెంటనే చేతులను చూపుతూ తన కండలను ప్రదర్శించింది. అయితే, ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. నెటిజన్లు ఫుల్ ఫిదా అయిపోతున్నారు. రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. వధువును చూస్తే ఫుల్ ఫిట్‌గా ఉంది. వరుడి పని అయిపోయినట్లే ఇక అంటూ ఫన్నీ సెటైర్లు వేస్తున్నారు. కాగా, ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్‌గా మారింది. మరెందుకు ఆలస్యం ఆ వీడియోను మీరూ  చూసేయండి.