
సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. వీటిల్లో నవ్వు కలిగించేవి కొన్ని ఉంటే.. బాధ పెట్టేవి చాలా ఉంటాయి. ఈ మధ్య చైన్ స్నాచింగ్ కేటు గాళ్లు విపరీతంగా రెచ్చి పోతున్నారు. అదును చూసి మహిళలను టార్గెట్ చేస్తున్నారు. కానీ ఆ తర్వాత వాళ్లు దొరికి పోతారు అన్న విషయం మాత్రం మర్చిపోతున్నారు. ఇక్కడా అక్కడా అని కాదు.. ఎక్కడ చూసినా చైన్ స్నాచింగ్ అనేది బాగా పెరిగి పోతుంది. రోడ్డుపై ఒంటరిగా మహిళలు నడిస్తే చాలు.. వాళ్ల మెడల్లో నుంచి చైన్లు లాక్కెళ్లి పోతున్నారు.
తాజాగా ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఓ మహిళ బస్సు దిగి లగేజీతో నడుచుకుంటూ వెళ్తుంది. అప్పుడే వచ్చిన చైన్ స్నాచింగ్ కేటుగాళ్లు తమ చేతి పనికి పని కల్పించారు. బైక పై వచ్చిన ఇద్దరు దుండగులు.. మహిళ మెడలో నుంచి బంగారు చైన్ లాక్కెళ్లారు. దీంతో ఆ మహిళ అదుపు తప్పి అక్కడే పడిపోయింది. వెంటనే దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. వెంటనే మహిళ ఆ పరిస్థితి నుంచి తేరుకుని పోలీసులకు కంప్లైంట్ చేసింది.
ఈ సంఘటన జులై 5వ తేదీన శుక్రవారం ఘజియాబాద్‌లోని ఇందిరా పురంలో జరిగింది. అక్కడే ఉన్న సీసీ కెమరాలో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దుండగులు కోసం వే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. @SachinGuptaUP తన X ఖాతా ద్వారా ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. దుండగులను శిక్షించాలని తీవ్రంగా స్పందిస్తున్నారు.
उत्तर प्रदेश : जिला गाजियाबाद के पॉश एरिया में आत्मनिर्भर बदमाशों ने सड़क पर दिनदहाड़े महिला से सोने की चेन लूट ली। pic.twitter.com/2yEw5d6tI0
— Sachin Gupta (@SachinGuptaUP) July 6, 2024