రోజురోజుకీ జనాభా పెరుగుతోంది. జనాలకు తగినట్లుగా భూమి లభ్యత లేదు. అంతేకాదు అడవులు మాయమైపోతున్నాయి. మానవ అసవసరాల కోసం నగరాలు, పట్టణాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. దీంతో మానవ అవసరాలకు తగినంత నీరు లభించడం లేదు. దీంతో నీటి సమస్య కూడా తీవ్రరూపం దాల్చుతోంది. ముఖ్యంగా పెరుగుతున్న వేడి, భూగర్భ జలాల మట్టం పడిపోవడంతో నీటి కష్టాలు మొదలయ్యాయి. ప్రపంచంలోని అనేక దేశాల్లో నీటి సంక్షోభంతో తీవ్ర ఇక్కట్లు పడుతున్నాయి. మన దేశంలో కూడా దేశ రాజధాని ధిల్లీ, బెంగుళూరు వంటి నగరాల్లో నీటి ఎద్దడి ఏర్పడింది. ఆ నగరాల్లో ప్రజల నీటి కష్టాల గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఈ నేపధ్యంలో భూగర్భ జలాల నిల్వ పెరిగేలా చర్యలు తీసుకోవాలని పర్యావరణ వేత్తలు, ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో ఒక అపార్ట్‌మెంట్ వర్షపు నీరు వృధాగా పోకుండా రెయిన్ హార్వెస్టింగ్ సిస్టమ్‌ను అమలు చేసి.. నీటి పునరుద్ధరణ కోసం భారీ బావిని నిర్మించినట్లు కనిపిస్తోంది.
బెంగుళూరులోని దొమ్మలూరులోని ఒక అపార్ట్‌మెంట్ వర్షాకాలంలో నీటి పునరుద్ధరణ కోసం రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్‌ను స్వీకరించింది. ఇంటి పైకప్పుపై సేకరించిన వర్షపు నీటిని మళ్ళీ ఉపయోగించుకునే విధంగా రీఛార్జ్ వెల్‌ను నిర్మించింది. ఈ బావిని మునియప్ప , అతని బృందం నిర్మించారు, మునియప్ప చేసిన గొప్ప పనికి అపార్ట్‌మెంట్ అసోసియేషన్ కూడా సత్కరించింది.
In an apartment in Domlur , Muniyappa and team dig a recharge well to place filtered rooftop rainwater into the aquifer. The well strikes water. It will now be used for recharge and discharge. Muniyappa is honoured by the apartment association with a shawl . #Bengaluru #WED pic.twitter.com/ownjyFya6J
— zenrainman (@zenrainman) June 5, 2024
దీనికి సంబంధించి జెన్‌రైమన్ అనే ఎక్స్ ఖాతాలో ఓ ప్రత్యేక వీడియో షేర్ చేయగా.. నీటి సంక్షోభాన్ని తీర్చే విధంగా అపార్ట్‌మెంట్‌లో బావి తవ్విన మునియప్పను అక్కడి ప్రజలు సన్మానిస్తున్న దృశ్యం వైరల్‌గా మారింది. షేర్ చేసిన వెంటనే నెటిజన్ల హృదయాలను దోచుకుంది. లక్షలాది లైక్స్. వ్వ్యూస్ ని సొంతం చేసుకుంది. ప్రతి ఒక్కరూ వర్షపు నీరువృధా పోకుండా ఇలా ఇంకుడు బావులను నిర్మించి ఒడిసి పట్టుకోవాలని పిలుపునిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..