Viral Video: చిటారు కొమ్మన చిక్కుకున్న ఎలుగుబంటి.. మనుషులను చూసి భయంతో కిందకు దిగేందుకు నిరాకరణ..

|

Sep 12, 2022 | 6:22 PM

ఎలుగుబంటి చెట్టు ఎక్కడం వచ్చుగానీ దిగడం రాదని.. చెట్టుమీద నిద్రపోయి కిందకు పడుతుందని పెద్దలు చెబుతూ ఉంటారు. తాజాగా ఓ ఎలుగుబంటి చెట్టుని ఏకంగా 30 అడుగుల ఎత్తుకు ఎక్కింది. చెట్టు కొమ్మల్లో ఇరుక్కుపోయింది.

Viral Video: చిటారు కొమ్మన చిక్కుకున్న ఎలుగుబంటి..  మనుషులను చూసి భయంతో కిందకు దిగేందుకు నిరాకరణ..
Bear Climbs Up Tree
Follow us on

Viral Video: ఎలుగుబంటి..అడవిలో నివసించే కౄర జంతువుల్లో ఒకటి. ఎలుగుబంటిని చూసి మనిషి ఎలా భయపడతాడో.. అదే విధంగా మనుషులను చూసి ఎలుగుబంటి కూడా భయపడతాదని చిన్నతనంలో మనం చదువుకున్నాం.. ఎలుగుబంట్లు ఒంటరిగా జీవించి రాత్రి సమయంలో చురుకుగా తిరుగుతాయి. ఇవి మంచి ఘ్రాణశక్తిని కలిగియుండి భారీగా ఉన్నా కూడా చలాకీగా పరుగెత్తగలవు. ఇవి చెట్లు ఎక్కగలవు, ఈదగలవు. అంతేకాదు ఎలుగుబంటి చెట్టు ఎక్కడం వచ్చుగానీ దిగడం రాదని.. చెట్టుమీద నిద్రపోయి కిందకు పడుతుందని పెద్దలు చెబుతూ ఉంటారు. తాజాగా ఓ ఎలుగుబంటి చెట్టుని ఏకంగా 30 అడుగుల ఎత్తుకు ఎక్కింది. చెట్టు కొమ్మల్లో ఇరుక్కుపోయింది. ఈ ఘటన ఒడిశాలో  సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.

ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలోని బోరిగుమ్మ పట్టణంలోని బిసింగ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నకులగూడ గ్రామంలో ఎలుగుబంటి చెట్టుకు ఇరుక్కుపోయింది. ఎలుగుబంటిని చూసేందుకు వేలాది మంది స్థానికులు చెట్టు కింద గుమిగూడారు. ఎలుగుబంటి నిన్న రాత్రి నుండి అంటే ఆదివారం నుండి చెట్టులో ఇరుక్కుపోయింది. చెట్టుపైన ఎలుగుబంటి ఉనికి గురించి తెలుసుకున్న గ్రామస్థులు ఎలుగుబంటిని చూసేందుకు ఆ ప్రాంతంలో గుమిగూడారు. జనం గుమిగూడి ఉండడం చూసి ఎలుగుబంటి చెట్టుపైకి ఎక్కి మూడు నాలుగు సన్నటి కొమ్మలను పట్టుకుంది.

ఇవి కూడా చదవండి

గుంపుకు భయపడి కిందకు దిగలేదు. దాదాపు 30 అడుగుల ఎత్తుకు ఎక్కి భయంతో దిగేందుకు నిరాకరించింది. స్థానికులు అటవీ శాఖకు, స్థానిక పోలీసులకు ఫోన్ చేసి ఎలుగుబంటి గురించి సమాచారం ఇచ్చారు. ఎలుగుబంటిని పట్టుకుని దాని సహజ ఆవాసాలకు తిరిగి పంపించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

 

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..