ఇదో వింత పెళ్లి.. ఒకేసారి 60 మంది స్త్రీ, పురుషులకు పెళ్లి చేసుకున్న మహిళ.. రీజన్ వింటే షాక్

|

Jul 05, 2024 | 12:10 PM

40 ఏళ్ల కార్లీ సారే వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్. ఆమె ఎన్నో పెళ్లిళ్లకు ఫంక్షన్లకు వీడియోలు, ఫోటోలను తీసింది. పెళ్లి వేడుకలో నవ దంపతులు ఇద్దరూ కలిసి ప్రమాణాలు చేయడం, ప్రేమను వ్యక్తం, బంధంతో ముడిపడి ఉంటామని ప్రమాణాలను చేయడం ఆమె చూసింది. అయితే కార్లీ తాను కూడా పెళ్లి చేసుకోవాలనుకుంది. అయితే ఆమె ఒకరిని జీవిత భాగస్వామిగా ఎంచుకోకుండా ఏకంగా 60 మందిని ఎంచుకుని పెళ్లి చేసుకుంది. నిజానికి ఈ 60 మంది వ్యక్తులు కార్లీకి అత్యంత సన్నిహితులు. వీరు ఆమె జీవితంలో చాలా ముఖ్యమైనవారు.

ఇదో వింత పెళ్లి.. ఒకేసారి 60 మంది స్త్రీ, పురుషులకు పెళ్లి చేసుకున్న మహిళ.. రీజన్ వింటే షాక్
Woman Marry 60 Friends
Image Credit source: X
Follow us on

ఎవరైనా సరే పెళ్లి గురించి ఆలోచిస్తే.. తన ఆలోచనలను పంచుకునే వ్యక్తిని జీవిత భాగస్వామిగా ఎంచుకోవాలని కోరుకుంటాడు. ఎవరితో సంతోషంగా జీవిస్తామని భావిస్తారో వారిని తమ జీవిత భాగస్వామిగా ఎంపిక చేసుకుంటారు. అయితే జీవిత భాగస్వామికి ఉండాల్సిన లక్షణాలు ఒకటి కంటే ఎక్కువ మందిలో ఈ లక్షణాలు ఉన్నట్లయితే మీరు ఏమి చేస్తారు? అయితే మీ మనసుకు నచ్చిన వారిని మాత్రమే ఎంచుకుంటారు. అయితే ఒక ఆస్ట్రేలియన్ మహిళ కేవలం ఒకరిద్దరి కాదు ఏకంగా మొత్తం 60 మందిని ఎంచుకుంది. ఆమె ఆ 60 మంది స్నేహితులను ఒకేసారి వివాహం చేసుకుంది.

60 మంది స్నేహితులను పెళ్లి చేసుకున్న మహిళ

ఇవి కూడా చదవండి

ది సన్ వెబ్‌సైట్ నివేదిక ప్రకారం 40 ఏళ్ల కార్లీ సారే వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్. ఆమె ఎన్నో పెళ్లిళ్లకు ఫంక్షన్లకు వీడియోలు, ఫోటోలను తీసింది. పెళ్లి వేడుకలో నవ దంపతులు ఇద్దరూ కలిసి ప్రమాణాలు చేయడం, ప్రేమను వ్యక్తం, బంధంతో ముడిపడి ఉంటామని ప్రమాణాలను చేయడం ఆమె చూసింది. అయితే కార్లీ తాను కూడా పెళ్లి చేసుకోవాలనుకుంది. అయితే ఆమె ఒకరిని జీవిత భాగస్వామిగా ఎంచుకోకుండా ఏకంగా 60 మందిని ఎంచుకుని పెళ్లి చేసుకుంది. నిజానికి ఈ 60 మంది వ్యక్తులు కార్లీకి అత్యంత సన్నిహితులు. వీరు ఆమె జీవితంలో చాలా ముఖ్యమైనవారు.

ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి

60 మందితో వివాహం:

నివేదిక ప్రకారం కార్లీకి వివాహం అంటేనే ఇష్టం లేదు. తన జీవితాన్ని ఒక వ్యక్తికి మాత్రమే అంకితం చేసి అతనితో మాత్రమే జీవించడం ఆమెకు ఇష్టం లేదు. దీంతో ఆమె ఒకరి కంటే ఎక్కువ మంది కోసం జీవించాలని కోరుకుంది. అంతేకాదు ఎక్కువ మంది భాగస్వాములతో జీవించాలని కోరుకుంది. అందుకే ఆమె చాలా మంది స్నేహితులను ఎంపిక చేసుకుంది.. ఇందులో పురుషులు, మహిళలు ఉన్నారు. దీని కారణంగా ప్రజలు ఆమె పెళ్లిని ఓ వింతగా భావిస్తున్నారు. అయితే వీరు ఇతరులను పట్టించుకోలేదు. తమ వివాహ వేడుకను ఘనంగా నిర్వహించారు.

ఈ వివాహ వేడుక
ఈ వివాహ వేడుక 3 రోజుల పాటు కొనసాగింది. వివాహ సమయంలో కార్లీ తన స్నేహితులందరి పట్ల లోతైన ప్రేమ, గౌరవం, నిబద్ధత కలిగి ఉంటానని ప్రమాణం చేసింది. వివాహం జరిగే సమయంలో ప్రమాణాలు చేయడం, టోస్ట్ పెంచడం, పెళ్లికి సంబంధించిన ప్రసంగాలు, లాంగ్ టేబుల్ డిన్నర్ వంటి సంప్రదాయ విషయాలు కూడా ఈ వేడుకలో ఉన్నాయి. వీటితో పాటు కొన్ని ప్రత్యేకమైన విషయాలు కూడా పెళ్లి వేడుకలో చేర్చాడు. వధువుతో సహా అందరిలాగే చాలా రంగురంగుల దుస్తులు ధరించారు. ఆమె తన భాగస్వాములందరికీ వధువు లేదా వరుడు అని పేరు పెట్టలేదు.. బదులుగా వారిని చీపురు అని పిలిచింది. తన స్నేహితులను పెళ్లి చేసుకోవడం తన జీవితంలో అత్యుత్తమ నిర్ణయం అని చెప్పడమే కాదు తన స్నేహితులను వివాహం చేసుకోవడం చాలా సురక్షితం అని చెప్పింది కార్లీ.

 

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..