ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. దేశ వ్యాప్తంగా వందల సంఖ్యలో వివాహాలు జరుగుతున్నాయి. ఎన్నో వందల పెళ్లిళ్లు.. సంతోషంగా బంధుమిత్రుల మధ్య ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే పెళ్లి వేడుకలో వధూవరులు ఇద్దరు ఎంతో సంతోషంగా.. అన్యోన్యంగా కనిపిస్తారు. అంతేకాకుండా.. వివాహం సమయంలో వధువరులు చేసే అల్లరి చేష్టలు.. బంధుమిత్రుల ఆటపాటలతో ఎంతో సందడి వాతావరణం ఉంటుంది. ఇలాంటి ఆనందక్షణాలను కెమెరాలో బంధిస్తుంటారు. ఇటీవల పెళ్ళిళ్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతున్నాయో తెలుసిందే. అందులో పెళ్లి వేడుకలో ఆకస్మాత్తుగా జరిగే ఘటనలు నవ్విస్తాయి. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో మాత్రం ద్యావుడా.. వాళ్లిద్దరికి ఏమైంది అనేలాగే ఉందండి. ఏంటీ అంతంగా ఏముంది అనుకుంటున్నారా ? అయితే ఇప్పుడు తెలుసుకుందాం.
ఆ వీడియోలో బంధుమిత్రుల మధ్య వివాహ వేడుక ఎంతో ఘనంగా జరుగుతుంది. అందులో ముందుగా వధూవరులిద్దరూ వరమాల వేసుకున్నారు. ఆ తర్వాత ఒకరికొకరు స్వీట్స్ తినిపించుకునే కార్యక్రమం ప్రారంభించారు. అప్పుడు వరుడు రసగుల్లాను తీసుకుని వధువు నోటికి అందించగా.. ఆమె దానిని తీసుకుని కోపంతో బయటకు పడేసింది. ఆ తర్వాత వధువు వరుడికి నీళ్లు తాగించే ఆచారం రావడంతో.. ఆమె అతనికి నీళ్ల గ్లాసు అందించగా.. అతడు తీసుకోలేదు. దీంతో కోపంతో వధువు ఆ నీళ్ల గాసును విసిరి కొట్టింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Keerthy Suresh: కీర్తి సురేష్ కొత్త అవతారం.. ఆ హీరోతో కలిసి లాయర్‍గా మారిన మహానటి..
Skin Care: మీ చర్మం తరచూ పొడిబారుతుందా ? అయితే మీకు ఈ వ్యాధులు ఉన్నట్లే.. ఏంటంటే..
AP Crime News: అయ్యో ఇంత ప్రేమనా..? కుక్క చనిపోయిందని యజమాని కూడా..