Viral Video: బయట ఫుడ్ తింటున్నారా జర ఆలోచించండి సాంబార్‌లో చచ్చిన ఎలుక.. వైరల్ వీడియో

|

Jun 21, 2024 | 7:57 PM

ఇప్పటికే ఐస్ క్రీమ్ లో వేలు, చాక్లెట్ సిరప్ లో చచ్చిన ఎలుక సంఘటలు మరవక ముందే.. మళ్ళీ సాంబార్ లో ఎలుక ఉన్న ఘటన వెలుగులోకి వచ్చింది. అహ్మదాబాద్‌లోని ప్రసిద్ధ 'దేవి దోస ప్యాలెస్'కు అవినాష్, అతని భార్య వెళ్ళారు. అక్కడ ఇచ్చిన సాంబార్ లో చచ్చిపోయిన ఎలుక కనిపించినట్లు దంపతులు ఆరోపిస్తున్నారు. అంతే కాదు ఈ విషయంపై దంపతులు రెస్టారెంట్‌ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్య తీసుకోలేదని వెల్లడించారు.

Viral Video: బయట ఫుడ్ తింటున్నారా జర ఆలోచించండి సాంబార్‌లో చచ్చిన ఎలుక..  వైరల్ వీడియో
Viral Video
Follow us on

ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్ పెట్టాలంటే కాదు రెస్టారెంట్ కు వెళ్లి నచ్చిన ఆహారాన్ని తినాలన్నా ఆలోచించే విధంగా కొన్ని కొన్ని సంఘటలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఐస్ క్రీమ్ లో వేలు, చాక్లెట్ సిరప్ లో చచ్చిన ఎలుక సంఘటలు మరవక ముందే.. మళ్ళీ సాంబార్ లో ఎలుక ఉన్న ఘటన వెలుగులోకి వచ్చింది. అహ్మదాబాద్‌లోని ప్రసిద్ధ ‘దేవి దోస ప్యాలెస్’కు అవినాష్, అతని భార్య వెళ్ళారు. అక్కడ ఇచ్చిన సాంబార్ లో చచ్చిపోయిన ఎలుక కనిపించినట్లు దంపతులు ఆరోపిస్తున్నారు. అంతే కాదు ఈ విషయంపై దంపతులు రెస్టారెంట్‌ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్య తీసుకోలేదని వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. ఇంటర్నెట్‌లో ఓ రేంజ్ లో దుమారం చెలరేగింది. ఈ సంఘటన ఖచ్చితంగా దిగ్భ్రాంతికరమైనది. అంతేకాదు ప్రస్తుతం వరసగా జరుగుతున్న సంఘటనలతో ఆహార భద్రత ఏ విధంగా ఉన్నదనే ప్రశ్న తలెత్తేలా చేస్తుంది.

సాంబార్‌లో చనిపోయిన ఎలుకను కనిపించడంతో రెస్టారెంట్‌లో పరిశుభ్రత గురించి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు ఆహారం తయారీ విషయంలో ఎటువంటి శ్రద్ధ పెట్టలేదని ఈ ఘటన దని చూపిస్తుంది. అదే సమయంలో ఫిర్యాదు చేసినప్పటికీ రెస్టారెంట్ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో వారి నిర్లక్ష్యాన్ని మరింత స్పష్టం చేసింది. ఈ విషయంపై అవినాష్ అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (AMC)కి కూడా సమాచారం అందించారు బాధిత దంపతులు. ఆ తర్వాత AMC విచారణ తర్వాత రెస్టారెంట్‌ను సీలు చేసింది.

ఇవి కూడా చదవండి

జూన్ 20న తన భార్యతో కలిసి డిన్నర్ కోసం దేవి దోస ప్యాలెస్‌కి వెళ్లినట్లు అవినాష్ చెప్పాడు. ఆర్డర్ చేసిన ఫుడ్ ను వడ్డించే ముందు సాంబార్ , చట్నీ వడ్డించారని అతను చెప్పాడు. అయితే సాంబారు తింటూ ఉండగా గిన్నెలో చనిపోయిన ఎలుకను చూసి షాక్ అయ్యానని వెల్లడించాడు. దీంతో కోపోద్రిక్తుడైన అవినాష్ వెంటనే తన మొబైల్ లో సాంబార్ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.

సాంబార్‌లో చనిపోయిన ఎలుక కనిపించిన వీడియో

తాజాగా హెర్షీస్ చాక్లెట్ సిరప్ బాటిల్ లో చనిపోయిన ఎలుక కనిపించిన వీడియోపై ఇంటర్నెట్‌లో చాలా దుమారం చెలరేగింది. ఆ తర్వాత కంపెనీ క్షమాపణలు చెప్పింది. . పామి శ్రీధర్ అనే యూజర్ జెప్టో ద్వారా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేశాడు. ఐస్‌క్రీం కోన్‌లో తెగిపడిన మానవ వేలిని వైద్యుడు గుర్తించిన మరో ఉదంతం ముంబైలో ఇంతకుముందు వెలుగులోకి వచ్చింది. పోస్ట్ వైరల్ కావడంతో FSSAI కంపెనీపై చర్య తీసుకున్న సంగతి తెలిసిందే.

 

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..