Viral Video: వరద నీటిలో కొడుకు కొనప్రాణం… ఒడ్డుకు లాక్కొచ్చి చూసిన కన్నతల్లికి షాక్‌

ఏ కన్న తల్లికి ఇలాంటి పరిస్థితి రావొద్దు..కన్న కొడుకు భార్య పిల్లలు లేక ఇబ్బందుల్లో ఉంటేనే చూస్తూ ఉండలేక పోయింది. అలాంటిది వరద నీరు ఇల్లంతా చుట్టుముట్టి కన్న పేగును కూడా తీసుకుపోతుంటే ఆ కన్నపేగు తట్టుకోలేక పోయింది. అచేతన స్థితిలో చనిపోయాడని తెలియక మృతదేహాన్ని లాక్కొచ్చే హృదయ విదారక ఘటన మేడ్చల్‌ జిల్లా...

Viral Video: వరద నీటిలో కొడుకు కొనప్రాణం... ఒడ్డుకు లాక్కొచ్చి చూసిన కన్నతల్లికి షాక్‌
Mother Trying To Save Son

Updated on: May 28, 2025 | 5:19 PM

ఏ కన్న తల్లికి ఇలాంటి పరిస్థితి రావొద్దు..కన్న కొడుకు భార్య పిల్లలు లేక ఇబ్బందుల్లో ఉంటేనే చూస్తూ ఉండలేక పోయింది. అలాంటిది వరద నీరు ఇల్లంతా చుట్టుముట్టి కన్న పేగును కూడా తీసుకుపోతుంటే ఆ కన్నపేగు తట్టుకోలేక పోయింది. అచేతన స్థితిలో చనిపోయాడని తెలియక మృతదేహాన్ని లాక్కొచ్చే హృదయ విదారక ఘటన మేడ్చల్‌ జిల్లా కుత్బుల్లాపూర్ మున్సిపాలిటీ సూరారంలో చోటు చేసుకుంది.

దక్షిణ తెలంగాణలో విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు దంచికొడుతున్నాయి. మంగళవారం హైదరాబాద్‌ను భారీ వర్షం ముంచెత్తింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈ క్రమంలో మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ లో జరిగిన ఓ ఘటన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. వర్షపు నీటిలో ఉన్న కొడుకు ప్రాణాన్ని కాపాడేందుకు ఓ వృద్ధురాలు చేసిన ప్రయత్నం విఫలయత్నంగా మారింది. రెక్కాడితే గాని డొక్కాడని ఓ పేద కుటుంబంలో రెండు గంటలసేపు కురిసిన వర్షం ఓ తల్లికి కడుపు కోత మిగిల్చింది.

సుభాష్ నగర్ డివిజన్ సూరారం కాలనీ లాస్ట్ బస్ స్టాప్ వద్ద కృష్ణవేణి అనే మహిళ ఇంటిని వరద నీరు ముంచెత్తింది. అదే సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న ఆమె కుమారుడు పద్మారావు మద్యం మత్తులో ఉన్నాడు. ఇంట్లోకి వర్షం నీరు ఎక్కువ వస్తుండటంతో ఆమె కొడుకును కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. ఎలాగోలా కొడుకును ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చింది. కానీ చివరకు పద్మారావు మృతిచెందారు. అసలే మద్యం మత్తులో ఉన్న పద్మారావు వర్షపు నీళ్లు మింగాడో.. లేక ఇంకా ఏదైనా ఇబ్బంది తలెత్తిందో కానీ నిమిషాల వ్యవధిలో మృతి చెందాడు.

ఆ వయసులో తనకు చేత కాకపోయినా కడుపు తీపితో కుమారుడు పద్మారావును కాపాడేందుకు ఆమె చేసిన ప్రయత్నం స్థానికులతో పాటు ఆ దృశ్యాలు చూసిన వారిని సైతం కంటతడి పెట్టించాయి. కుమారుడి ప్రాణాలు కాపాడేందుకు తల్లి చేసిన ప్రయత్నాన్ని స్థానికులు వీడియోలు తీశారు. సోషల్ మీడియాలో ఆ వీడియోలు వైరల్ గా మారాయి.

 

వీడియో చూడండి: