వందేళ్ల నాటి ఇంటిని మరమ్మతు చేస్తుండగా గోడలో కనిపించిన వింత వస్తువు.. నిజం తెలుసుకున్న అతడు షాక్ అయ్యాడు!

పాత ఇళ్ల ప్రత్యేకత ఏమిటంటే అవి ఇంటి యజమాని తరువాతి తరాలకు కూడా తెలియని అనేక రహస్యాలను దాచిపెడతాయి. ఆ రహస్యాలు ఆ ఇంటిని నిర్మించిన వారికి మాత్రమే తెలుసు. ఇటీవల ఒక వ్యక్తి తన 100 ఏళ్ల పురాతన ఇంట్లో ఒక వింత వస్తువును కనుగొన్నాడు. దానిని చూసి అతను షాక్ అయ్యాడు. ఆ వింత విషయం వారి ఇంటి గోడ లోపల దొరికింది. బోస్టన్ (మసాచుసెట్స్)లోని ఒక ఇంట్లో దాగి ఉన్న ఒక నిర్మాణ శైలి సోషల్ మీడియాలో చాలా చర్చకు దారితీసింది.

వందేళ్ల నాటి ఇంటిని మరమ్మతు చేస్తుండగా గోడలో కనిపించిన వింత వస్తువు.. నిజం తెలుసుకున్న అతడు షాక్ అయ్యాడు!
100 Year Old House

Updated on: Aug 17, 2025 | 11:05 AM

సోషల్ మీడియా రెడ్డిట్‌లో ఒక పోస్ట్‌ విపరీతంగా వైరల్‌ అవుతోంది. u/Drunk__Goku పేరుతో రెడ్డిట్‌లో పోస్ట్ చేసిన ఈ పోస్ట్‌పై నెటిజన్లు సైతం పెద్ద సంఖ్యలో స్పందించారు. ఈ పోస్ట్‌ చేసిన 33 ఏళ్ల ఇంటి యజమాని తన ఇంటి గోడల లోపల దాగి ఉన్న రహాస్యాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు. 100 ఏళ్లనాటి తన పురాతన ఇంటికి మరమ్మతులు చేస్తుండగా, గోడలలో చెక్క పాకెట్ తలుపులను గుర్తించాడు. ఈ తలుపులు వాటి అసలు కలప, డిజైన్‌లో ఉండటమే కాకుండా, పాత హార్డ్‌వేర్‌ను కూడా చెక్కుచెదరకుండా కలిగి ఉన్నాయి. గోడల అసాధారణ వెడల్పును చూసిన తర్వాత తనకు అనుమానం వచ్చిందని, వెంటనే ఇంటి నిర్మాణానికి సంబంధించి స్థానిక లైబ్రరీ నుండి ఇంటి పాత అంతస్తు ప్లాన్‌ను చెక్‌ చేశాడు. అది పాకెట్ తలుపులను చూపించింది.

తొలగించబడిన ఇతర తలుపులు ఇంటి నేలమాళిగలో ఉంచబడ్డాయి. కానీ పాకెట్ తలుపులు అక్కడ కనిపించకపోవడంతో, అవి గోడలలో దాచబడి ఉంటాయని అతను నమ్మాడు. అనుమానం సరైనదని నిరూపించబడింది. అతను గోడలు తొలగించినప్పుడు, లోపల అతను అద్భుతమైన చెక్క డబుల్ పాకెట్ తలుపులను చూశాడు. గోడలో పాకెట్ తలుపు దొరికింది అంటూ అతను తనకు ఎదురైన అనుభవాన్ని రెడ్డిట్‌లో ఫోటోల ద్వారా పాటు పంచుకున్నాడు. రెండు తలుపులు గోడలకు ఎలా చక్కగా అమర్చబడ్డాయో ఈ చిత్రం చూపిస్తుంది.

Look What I Found Hidden in the Walls!
byu/Drunk__Goku incenturyhomes

ఇవి కూడా చదవండి

కాగా, సోషల్ మీడియాలో పోస్ట్‌ చేసిన వెంటనే ఈ పోస్ట్ వైరల్ అయ్యింది. 2,700 కంటే ఎక్కువ మంది వీడియోని వీక్షించారు. వేలాది మంది వినియోగదారులు పోస్ట్‌పై ప్రశంసించారు. అలాంటి చెక్కు చెదరకుండా ఉండే తలుపులు దొరకటం నిజంగా జాక్‌పాట్ అంటూ ఒకరు రాయగా, ఇది నిజంగా అందంగా ఉందంటూ మరొకరు రాశారు. మీరు ఎంత అదృష్టవంతులు, మీరు ఎంత అద్భుతమైన ఆవిష్కరణ చూశారు అంటూ చాలా మంది వినియోగదారులు తలుపుల చక్కటి పనితనం, అందాన్ని ప్రశంసించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…