Trending: ఆస్ట్రేలియా(Australia)లోని క్వీన్స్‌లాండ్(Queensland)లోని సన్‌షైన్ కోస్ట్‌లో ‘నూసా స్నేక్ క్యాచర్స్’ సెంటర్ ఉంది. ఆ సమీప నివాస ప్రాంతాల్లో ఎప్పుడు.. ఎక్కడ పాము సంచరిస్తుందని కాల్ వచ్చిన అక్కడి స్నేక్ క్యాచర్స్ వెంటనే ఆ ఏరియాలో వాలిపోయి.. జాగ్రత్తగా ఆ పాములను బంధించి.. వాటిని అటవీ ప్రాంతాల్లో వదిలేస్తుంటారు. తాజాగా టిన్బీర్వా అనే ప్రాంతంలో పాము ఉందనే సమాచారంతో ల్యూక్ హంట్లీ అనే స్నేక్ క్యాచర్ అక్కడికి చేరుకున్నాడు. ఆ ప్రాంతమంతా కలియ తిరిగాడు. కానీ పాము మాత్రం కనిపించలేదు. ఆశ్చర్యకరంగా బిల్డింగ్ రూఫ్ పెద్ద ఎత్తున పాము కుబుసాలు అతడికి కనిపించాయి. అవన్నీ కూడా విభిన్న జాతులకు చెందిన పాములవి. దీంతో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున పాముల సంచరిస్తున్నాయని అతడు ధృవీకరించాడు. కొండచిలువ, ట్రీ స్నేక్స్, బ్రౌన్ ట్రీ స్నేక్స్ జాతులకు చెందిన 32 పాము చర్మాలను కనుగొన్నాడు. ఆ పాము కుబుసాలతో 3 పెద్ద బ్యాగులు నిండిపోయాయి. 32 చర్మాలు దొరికాయంటే 32 పాములు ఉన్నట్లు కాదని ల్యూక్ హంట్లీ వివరించాడు. వివిధ వయసుల్లో పాములు కోశాలు విడుస్తాయని తెలిపాడు.
పాము కుబుసం విడవడం అంటే ఏమిటి..?
మనుషుల చర్మంపై కూడా చర్మం పొలుసుల మాదిరి ఊడిపోతూ ఉంటుంది. దైనందిన జీవితంలో మనం దాన్ని గుర్తించలేం. అయితే పాములు మాత్రం చర్మాన్ని ఒకేసారి విడుస్తాయి. ఏ పాముకు అయినా కొంత వయసు తర్వాత పాత స్కిన్ కింద.. కొత్త స్కిన్ ఏర్పాడుతుంది. ఆ ప్రాసెస్ కంప్లీట్ అవ్వగానే.. ఆ స్నేక్ పాత చర్మాన్ని వదిలేస్తుంది. ఇలా చేయడగం ద్వారా.. హాని కలిగించే పరాన్నజీవుల నుంచి రక్షణ పొందుతుంది. ఇందుకోసం పాము ఓ గరుకైన ప్రదేశాన్ని ఎంచుకుని తన స్కిన్‌ను నోటి వద్ద రాపిడికి గురిచేస్తుంది. అలా ఏర్పడిన చీలక సాయంతో చర్మం మొత్తాన్ని విసర్జిస్తుంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి