Viral Photo : నెట్టింట్లో రచ్చ చేస్తోన్న ఫోటో.. జుట్టు పీక్కుంటున్న నెటిజన్లు.. ఇదేంటో మీరేమైనా కనిపెట్టగలరా?..

|

Mar 09, 2022 | 8:40 PM

Optical Illusion viral Photo: సోషల్ మీడియాలో ప్రతిరోజూ వేలకొద్దీ చిత్రాలను షేర్ చేస్తుంటారు నెటిజన్లు. వీటిలో వందలాది ఫోటోలు వైరల్‌గా..

Viral Photo : నెట్టింట్లో రచ్చ చేస్తోన్న ఫోటో.. జుట్టు పీక్కుంటున్న నెటిజన్లు.. ఇదేంటో మీరేమైనా కనిపెట్టగలరా?..
Viral Photos
Follow us on

Optical Illusion viral Photo: సోషల్ మీడియాలో ప్రతిరోజూ వేలకొద్దీ చిత్రాలను షేర్ చేస్తుంటారు నెటిజన్లు. వీటిలో వందలాది ఫోటోలు వైరల్‌గా మారుతుంటాయి. వీటిని యూజర్లు విపరీతంగా ఎంజాయ్ చేస్తుంటారు. ఈ చిత్రాలలో కొన్ని హృదయానికి హత్తుకునేలా ఉంటే, మరికొన్ని చలింపజేస్తాయి. అదే సమయంలో, కొన్ని చిత్రాలను చూసి ప్రజలు గందరగోళానికి గురవుతారు. ఎందుకంటే అందులో ఉన్నదేంటో తెలుసుకోవడానికే చెమటలు పట్టేస్తాయి. ఎంత వెతికినా.. అందులో దాగి ఉన్నదేంటో కనిపెట్టలేని పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఫోటో ఒకటి నెట్టింట్లో రచ్చ చేస్తోంది. ఈ ఫోటోలో ఒక్కొక్కరికి ఒక్కో రకమైన వింత ఆకారం కనిపిస్తుండగా.. ఏ ఒక్కరూ పర్‌ఫెక్ట్‌గా చెప్పలేకపోతున్నారు. ఇంతకీ ఆ ఫోటో ప్రత్యేకత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

వైరల్ అవుతున్న ఈ ఫోటోను మొదటిసారి చూస్తే.. అయోమయానికి గురవడం ఖాయం. ఇందులో ఏముందో స్పష్టంగా తెలుసుకోలేక తికమకపడిపోయారు. వాస్తవానికి ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటోలు ప్రజలను కన్‌ఫ్యూజ్ చేస్తాయి. ఈ చిత్రం కూడా అలాగే ఉంది. దీనిని చూడగానే.. పిల్లులు, ఎలుకలు ఉన్నట్లుగా కనిపిస్తుంటుంది. నిజంగా అందులో ఏముందో తెలుసుకోవడానికి చాలా మంది ప్రయత్నించారు. కానీ ఏ ఒక్కరూ తేల్చలేకపోయారు. చాలా మంది నెటిజన్లు తమ బుర్రలకు పదును పెట్టి మరీ వెతికి చూశారు. ఎంత వెతికినా.. చెప్పలేకపోయారు. వాస్తవానికి ఈ ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటోలో ఏమీ లేదు. దీనిని నిశితంగా పరిశీలిస్తే.. క్షితజ సమాంతర రేఖలు మాత్రమే కనిపిస్తాయి. ఇంకా ఇందులో నిజం ఏంటో తెలుసుకోవాలంటే.. ఈ ఫోటోను జూమ్ చేసి చూస్తే క్రిస్టల్ క్లీయర్‌గా కనిపిస్తుంది. ఒకవేళ మీకు ఏమైనా జంతువుల ఆకారాలు కనిపిస్తున్నట్లయితే.. కామెంట్ రూపంలో మీ అభిప్రాయన్ని పంచుకోండి.

Also read:

Andhra Pradesh: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఏపీలో పాలాభిషేకం.. ఎందుకో తెలుసా..

Picture Puzzles: టెన్షన్ వదిలేయ్.. ఈ ఫజిల్ ఛేజ్ చెయ్.. ఈ ఫోటోలో అందమైన కుందేలు ఎక్కడుందో చెప్పుకోండి చూద్దాం..!

Viral Video: రామ చిలుక స్నానం చేయడం ఎప్పుడైనా చూశారా?.. ఎంత చూడముచ్చటగా ఉన్నాయో..!