Bike Stunt Video: బైక్ సింగిల్ టైర్ పై డ్రైవ్ చేసి స్టంట్ చేస్తూ రోడ్డుమీద పడిన యువకుడు.. ఎక్కడనుంచి వస్తారురా అంటున్న నెటిజన్లు

|

Dec 03, 2022 | 3:51 PM

ఎటువంటి సాధన చేయకుండా.. శిక్షణ తీసుకోకుండా .. అసలు కారణం లేకుండా చేసే విన్యాసాలతో కొందరు తమ ప్రాణాలను ప్రమాదంలో పడేసుకోవడమే కాదు.. ఇతరులకు కూడా ఇబ్బందిని కలిగిస్తారు.

Bike Stunt Video: బైక్ సింగిల్ టైర్ పై డ్రైవ్ చేసి స్టంట్ చేస్తూ రోడ్డుమీద పడిన యువకుడు.. ఎక్కడనుంచి వస్తారురా అంటున్న నెటిజన్లు
Bike Stunt Video
Follow us on

ఎప్పుడైనా మనసు చిరాకుగా ఉంటే వేనంటే సంతోషం కోసం ఫన్నీ వీడియోలపై దృష్టి పెడతారు. సోషల్ మీడియాలో వినోదం కోసం అనేక వీడియోలు అందుబాటులో ఉన్నాయి. దీంతో వాటిని మీరు అన్వేషిస్తారు. అప్పుడు మీ వినోదం కోసం చూసే వీడియాలతో సమయం కూడా తెలియకుండా గడిచిపోతుంది. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ వీడియోలో సన్నివేశాన్ని చూసి.. నెటిజన్లు తమకు నవ్వాలో.. లేక యువత నిర్లక్ష్యం.. ప్రాణాలు అంటే లెక్కలేక పోవడంపై కోపం వ్యక్తం చేయాలో అర్ధం కావడం లేదని అంటున్నారు.

స్టంట్స్ చేయడం అనేది చిన్నపిల్లల ఆట కాదు.. స్టంట్స్ చేయడానికి సాధన అవసరమన్న సంగతి తెలిసిందే. అలా సాధన తీసుకుని చేసిన స్టంట్స్ ను ఎప్పుడైనా, ఎక్కడైనా దైర్యంగా ప్రదర్శించవచ్చు. అయితే ఎటువంటి సాధన చేయకుండా.. శిక్షణ తీసుకోకుండా .. అసలు కారణం లేకుండా చేసే విన్యాసాలతో కొందరు తమ ప్రాణాలను ప్రమాదంలో పడేసుకోవడమే కాదు.. ఇతరులకు కూడా ఇబ్బందిని కలిగిస్తారు. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో రోడ్డు మీద కదులుతున్న బైక్ మీద విన్యాసాలు చేయడానికి ప్రయత్నించి.. హీరో అవుదామని జీరో అయ్యాడు. ఈ వీడియోపై ఓ లుక్ వేయండి..

ఇవి కూడా చదవండి

వీడియోలో, ఒక యువకుడు రహదారిపై బైక్ తో స్టంట్‌ను చేయడానికి ప్రయత్నించాడు. ఆ యువకుడు మొదట మొదటి సీటుపై నుంచి లేచి నిలబడి బైక్‌ ముందు టైర్ ను పైకి లేపాడు. అలా కొంచెం దూరం డ్రైవ్ చేసి.. తర్వాత స్టైల్ కొట్టే క్రమంలో బ్యాలెన్స్ కోల్పోయి నేరుగా రోడ్డుపై పడిపోయాడు. అయితే ఈ యాక్సిడెంట్ జరిగిన సమయంలో రోడ్డుమీద ఎటువంటి వాహనాలు వెళ్లకపోవడంతో అక్కడ పెను ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. లేకుంటే పెను ప్రమాదం జరిగి ఉండేది.

ఈ వీడియో zx_rider_king_ అనే ఖాతాలో షేర్ చేశారు. 17 వేల మందికి పైగా లైక్ చేశారు. రకరకాల కామెంట్స్ ను చేశారు. ‘ప్రజలు తమ ప్రాణాలను పణంగా పెట్టి ఏమి పొందుతారో తెలియదు.’  అని ఒకరు అంటే.. , ‘ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్‌కి చాలా అభ్యాసం అవసరం’ అని మరొకరు కామెంట్ చేయగా.. ‘ఇలాంటివి కేవలం ప్రొఫెషనల్ వ్యక్తులే చేస్తే మంచిది’ అని మరో యూజర్ సలహా ఇచ్చారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..