ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఈ సందర్భంగా కొన్ని పెళ్లి వార్తలు, ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో బాగా వైరల్ అవుతున్నాయి. అలాంటి వార్తే ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. పెళ్లికి వచ్చిన అతిథులను సరదాగా ఆటపట్టిద్దామనకున్న ఓ పెళ్లి కూతురు.. పెళ్లి వంటకాల్లో గంజాయిని కలిపింది. పాపం ఇవేవీ తెలియని అతిథులు పెళ్లి విందును ఆరగించారు. ఆ తర్వాత ఒక్కొక్కరూ అస్వస్థతకు గురై స్పృహ తప్పి పడిపోయారు. పెళ్లి వేడుకలో అసలు ఏం జరుగుతందో తెలియని పరిస్థితి నెలకొంది. ఆస్పత్రికి తీసుకెళితే కానీ అసలు విషయం తెలియలేదు ఆహారంలో గంజాయి మిక్స్ చేశారని. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు పెళ్లికూతురితో పాటు క్యాటరింగ్ నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. అమెరికాలోని ఫ్లోరిడా నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఫ్లోరిడాకు చెందిన దాన్య అనే అమ్మాయి ఇటీవల పెళ్లిచేసుకుంది. సుమారు 50 మంది వరకు అతిథులు ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. పెళ్లి విందును ఆరగించిన తర్వాత ఒక్కొక్కరూ స్పృహతప్పి పడిపోయారు. బాధితులను ఆస్పత్రికి తీసుకెళ్లాక పెళ్లి వంటకాల్లో గంజాయి కలిపారని, అందుకే అతిథులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని డాక్టర్లు తెలిపారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు పెళ్లి కూతురే ఈ పనికి పాల్పడిందని నిగ్గుతేల్చారు. అతిథులను ఆటపట్టించేందుకే తాను ఈ పని చేసినట్లు విచారణలో పేర్కొంది. దీంతో గంజాయి వాడినందుకు ఆమెతో పాటు క్యాటరింగ్ నిర్వాహకులను అరెస్ట్ చేశారు పోలీసులు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Also Read:
Share Market Updates: మండే మంట.. ఆరంభంలోనే కుప్పకూలిన మార్కెట్లు.. ఈ షేర్లు మాత్రం లాభాల్లో..
Viral Video: వావ్.. వాట్ ఏ డేరింగ్.. సింహంతో సయ్యాటలు.. అలా ఎలా గురు..! అంటున్న నెటిజన్లు..