
టైటానిక్ హౌస్‌కి స్వాగతం అంటూ ఓ ఫోటో వైరల్ అవుతుంది నెట్టింట్లో.. టైటానిక్ ను చూసి దాని స్పూర్తితో ఓడలాంటి ఇంటిని నిర్మించాడు. ఉత్తర 24 పరగణాల్లోని హెలెంచా జిల్లా నివాసి అయిన మింటు రాయ్ 20-25 సంవత్సరాల క్రితం సిలిగురిలోని ఫసిదావా ప్రాంతంలో స్థిరపడ్డారు. ప్రస్తుతం వ్యవసాయం చేస్తున్నాడు. తన తండ్రి మన్రంజన్ రాయ్‌తో కలిసి సిలిగురికి వచ్చాడు. మింటు మెల్లగా తన కలల స్వగృహానికి జీవం పోయడం ప్రారంభించాడు. రాయ్ 2010లో ఈ ఇంటిని నిర్మించడం ప్రారంభించాడు. దాదాపు 30 అడుగుల ఎత్తులో ఉన్న ఇల్లుని అత్యంత ఆకర్షణీయంగా నిర్మించాడు.
మింటు రాయ్ కోల్‌కతాలో నివసించినప్పుడు.. ఓడలా కనిపించే ఇంటిని నిర్మించాలని కలలు కన్నాడు. తన కలల ప్రాజెక్ట్ కోసం చాలా మంది ఇంజనీర్లను సంప్రదించాడు. అయితే ఎవరూ మింటు రాయ్ ఆసక్తిని విశ్వసించలేదు. ఎవరూ ముందుకు రాలేదు. మింటూకి తాను స్వయంగా ఇల్లు కట్టుకోవడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా అప్పుడప్పుడు నిర్మాణ పనులు నిలిచిపోయాయి. తాపీ మేస్త్రీలకు చెల్లించేంత డబ్బు తన వద్ద లేదని గ్రహించిన మింటూ.. మూడేళ్లపాటు నేపాల్ వెళ్లి తాపీపని నేర్చుకున్నాడు.
మింటు షిప్-హోమ్ నిర్మాణ పనులు 2010లో ప్రారంభించాడు. ఈ ఇళ్లు 39 అడుగుల పొడవు, 13 అడుగుల వెడల్పుతో ఉంది. దాదాపు 30 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఇల్లు ఆ ప్రాంతానికి ప్రధాన ఆకర్షణగా మారింది. ఇంటి నిర్మాణం కోసం కావాల్సిన డబ్బుల కోసం మింటూ వ్యవసాయం చేస్తున్నాడు. వివిధరకాల పంటలను వేసి.. మార్కెట్ లో అమ్మి.. ఆ డబ్బుని పొదుపు చేస్తూ.. తన కలల ఇంటిని నిర్మిస్తున్నాడు.
ఇంటికి తన తల్లి పేరు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు మింటూ తెలిపారు. ఇప్పటి వరకు రూ.15 లక్షలు ఖర్చు చేసినట్లు అంచనా. వచ్చే ఏడాది నాటికి పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పాడు. ఇంటి నిర్మాణం పూర్తి అయ్యాక.. తరువాత పై అంతస్తులో రెస్టారెంట్‌ని నిర్మించాలనుకుంటున్నాను.. తద్వారా కొంత ఆదాయం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..