Viral News: దక్షిణాది ఫేమస్ టిఫిన్స్ కు వింతపేర్లు పెట్టి అమ్ముతోన్న రెస్టారెంట్.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న నెటిజన్లు..

|

Jul 19, 2022 | 7:33 AM

ప్రస్తుతం ఒక స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది, ఇందులో దక్షిణ భారతదేశానికి చెందిన ఆహారపదార్ధాలైన ఇడ్లి,దోస, వంటి వాటికి సరికొత్త పేర్లతో ఉండడంతో  (Weird Food Names) అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

Viral News: దక్షిణాది ఫేమస్ టిఫిన్స్ కు వింతపేర్లు పెట్టి అమ్ముతోన్న రెస్టారెంట్.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న నెటిజన్లు..
South Indian Food
Follow us on

Viral News: ప్రపంచంలో రకరకాల సాంప్రదయాలు, ఆచారాలు, భిన్న ఆహారపు అలవాట్లు ఉన్నాయి. అంతేకాదు. ఆహారానికి ఉన్న పేర్లతో ఆ ప్రదేశాలకు కూడా తగిన గుర్తింపు ఉంది. మన దేశంలో ఉత్తర భారతదేశంలో (North Indian Dishes) నివసించే ప్రజలు ఆహారపు అలవాట్లు.. దక్షిణ భారత దేశంలో(South Indian Dishes) నివసిస్తున్న వారి ఆహారపు అలవాట్లు భిన్నంగా ఉంటాయి. నార్త్ ఇండియన్స్ రోటి, పూరి వంటి వాటిని ఇష్టంగా తింటే.. దక్షిణాదివారు ఇడ్లీ, దోస, సాంబార్ మొదలైన వంటకాలను ఇష్టంగా తింటారు. అయితే ఇప్పుడు దక్షిణాదికి చెందిన ఈ ప్రసిద్ధ వంటకాలను ఉత్తర భారతీయులు కూడా ఇష్టపడుతున్నారు. చాలా ఇష్టంగా తింటరున్నరు. ఎందుకంటే రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని ఇస్తాయి ఈ టిఫిన్స్. అయితే ఎక్కడైనా ఈ ఆహారపదార్ధాలను ఇడ్లి, దోశ, మసాలా దోశ వంటి పేర్లతోనే పిలుస్తారు. అయితే ప్రస్తుతం ఒక స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది, ఇందులో దక్షిణ భారతదేశానికి చెందిన ఆహారపదార్ధాలైన ఇడ్లి,దోస, వంటి వాటికి సరికొత్త పేర్లతో ఉండడంతో  (Weird Food Names) అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

అమెరికాలోని ఇండియన్ క్రీప్ కో.. అనే భారతీయ రెస్టారెంట్ దక్షిణ భారత వంటకాలకు చాలా విచిత్రమైన పేర్లను పెట్టింది.  ఈ రెస్టారెంట్ మెనూ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ప్రజలు రెస్టారెంట్‌ను తీవ్రంగా ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఈ రెస్టారెంట్‌లో సౌత్ ఇండియన్ వంటకాలు అందుబాటులో ఉంటాయి. అయితే వాటి పేరు మార్చారని తెలుస్తోంది.  ఇడ్లీ , దోస, గారెలు ఇలాంటి ఆహారపదార్ధాలు ఈ రెస్టారెంట్‌ సరికొత్త పేర్లతో కస్టమర్స్ కు అందిస్తోంది.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న స్క్రీన్ షాట్ లో..  ఈ రెస్టారెంట్‌లోని సాదా దోసకు ‘నేకెడ్ క్రేప్’ అని పేరు పెట్టగా, మసాలా దోసకి ‘స్మాష్డ్ పొటాటో క్రేప్’ అని పేరు పెట్టారు. అంతేకాకుండా.. దక్షిణ భారత ప్రజల ఇష్టమైన వంటకం ఇడ్లీ- సాంబార్‌కు ఇక్కడ డంక్డ్ రైస్ కేక్ డిలైట్ అని పేరు పెట్టారు. ఇక సాంబార్ వడకి కూడా   డంకెడ్ డోనట్ డిలైట్ అంటూ సరికొత్త పేరుని నామకరణం చేశారు. ఈ వింత పేర్లను తెలుసుకున్న స్తానిక ప్రవాసాంధ్రులతో పాటు.. ఆ టిఫిన్స్ ను ఇష్టంగా తినే భారతీయులు ఆశ్చర్యపోయారు.

రెస్టారెంట్‌లోని ఈ వింత మెనూ పేర్ల స్క్రీన్‌షాట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వింత పేర్లను తెలుసుకుని కొందరు విచారం వ్యక్తం చేస్తుంటే మరికొందరు ఇలాంటి రెస్టారెంట్లను ఇండియన్ రెస్టారెంట్లు అని పిలవకూడదని అంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..