AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: భార్యను కాటేసిన విషసర్పం.. భర్త చేసిన ఊహించని పనికి అందరూ షాక్..

భార్యను పాము కాటేసింది. దీంతో భర్త వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకురావడానికి ముందు మరో ఊహించని పని చేశాడు. అదేంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

Viral: భార్యను కాటేసిన విషసర్పం.. భర్త చేసిన ఊహించని పనికి అందరూ షాక్..
Snakebite
Ram Naramaneni
|

Updated on: Jun 24, 2022 | 6:25 PM

Share

Uttar Pradesh: యూపీలోని ఉన్నావ్‌(Unnao)లో ఓ ఇంట్రస్టింగ్ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. త‌న భార్య‌ను కాటేసిన పామును ప‌ట్టి.. సీసాలో బంధించి  భ‌ర్త ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. ఆ పామును చూసి ఆస్పత్రి సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. పామును హాస్పిటల్‌కు ఎందుకు తెచ్చావని అక్కడి డాక్టర్లు ప్రశ్నించగా.. అతడు దిమ్మతిరిగే సమాధానం విచ్చాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మఖీ పోలీస్ సర్కిల్ పరిధిలోని అఫ్జల్ నగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ మహిళను పాము కాటేసింది. ఆమె వెంటనే ఆ విషయాన్ని భర్త  రామేంద్ర యాదవ్‌కు చెప్పింది. అతను వెంటాడి పామును పట్టుకున్నాడు. దాన్ని ఒక సీసాలో పెట్టి.. భార్యతో పాటు ఆస్పత్రికి తీసుకువచ్చాడు. పామును ఎందుకు తీసుకొచ్చావ్? అని వైద్యులు అత‌డిని ప్ర‌శ్నించారు. ‘నా భార్య‌కు ఏ పాము కాటేసిందని మీరు అడిగితే నేనేం చెప్పాలి. అందుకే మీరే చూసి వైద్యం చేస్తారని.. ఆ పామును పట్టుకొచ్చాను’ అని సీదాగా సమాధానం ఇచ్చాడు. పాముకాటుకు గురైన వారిని  పాము ఆకారం, పరిమాణం గురించి గతంలో  వైద్యులు అడిగిన విషయం తన దృష్టికి వచ్చిందని.. అందుకే ఇలా చేసినట్లు చెప్పాడు.

అనంతరం యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ తన భార్య ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత పామును అటవీ ప్రాంతంలో విడిచిపెడతానని చెప్పాడు. పాము ఊపిరి పీల్చుకునేలా ప్లాస్టిక్ బాటిల్‌కు రంధ్రాలు వేశామని వెల్లడించాడు. కాగా పాము కాటుకు గురైన మహిళ ప్రాణాపాయం నుంచి బయటపడిందని డాక్టర్లు తెలిపారు.

జాతీయ వార్తల కోసం

విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!