Viral News: 9 ఏళ్లపాటు భయంకరమైన నొప్పితో జీవిస్తున్న వ్యక్తి.. CT స్కాన్ చూసి షాక్ తిన్న డాక్టర్..

|

Jul 24, 2024 | 8:48 PM

రష్యాకు చెందిన ఓ వ్యక్తి విషయంలోనూ అలాంటిదే జరిగింది. వాస్తవానికి ఈ రష్యన్ వ్యక్తి గత 9 సంవత్సరాలుగా తన పక్కటెముకల క్రింద భయంకరమైన నొప్పి, అసౌకర్యాన్ని అనుభవిస్తున్నాడు. ఆ తర్వాత ఓ రోజు డాక్టర్ల కోరిక మేరకు సీటీ స్కాన్ చేయించుకుని రిపోర్టు చూసి తానే కాదు డాక్టర్లు కూడా షాకయ్యారు. వ్యక్తి పేరు వెల్లడించలేదు అయితే ప్రస్తుతం వ్యక్తి వయస్సు 53 సంవత్సరాలు అని చెప్పారు.

Viral News: 9 ఏళ్లపాటు భయంకరమైన నొప్పితో జీవిస్తున్న వ్యక్తి.. CT స్కాన్ చూసి షాక్ తిన్న డాక్టర్..
Viral News
Follow us on

చాలా సార్లు మనుషులకు శారీరకంగా ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే దానిని పెద్దగా సీరియస్ గా తీసుకోరు. అయితే చిన్న చిన్న సమస్యలను పట్టించుకోకున్నా ఫర్వాలేదు .. అయితే అవి పెద్ద సమస్యలుగా మారి వాటిని పట్టించుకోక పోవడం వలన వాటి పర్యవసానాలను చవి చూడాల్సి వస్తుంది. ఇలాంటి సంఘటనల గురించి అనేక వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. రష్యాకు చెందిన ఓ వ్యక్తి విషయంలోనూ అలాంటిదే జరిగింది. వాస్తవానికి ఈ రష్యన్ వ్యక్తి గత 9 సంవత్సరాలుగా తన పక్కటెముకల క్రింద భయంకరమైన నొప్పి, అసౌకర్యాన్ని అనుభవిస్తున్నాడు. ఆ తర్వాత ఓ రోజు డాక్టర్ల కోరిక మేరకు సీటీ స్కాన్ చేయించుకుని రిపోర్టు చూసి తానే కాదు డాక్టర్లు కూడా షాకయ్యారు.

వ్యక్తి పేరు వెల్లడించలేదు అయితే ప్రస్తుతం వ్యక్తి వయస్సు 53 సంవత్సరాలు అని చెప్పారు. ఆడిటీ సెంట్రల్ వెబ్‌సైట్ నివేదిక ప్రకారం రష్యాలోని కిరోవ్ రీజినల్ క్లినికల్ హాస్పిటల్‌లో చేరిన ఈ రోగి చాలా కాలంగా తన శరీరంలోని కుడి వైపున పక్కటెముకల క్రింద తీవ్రమైన నొప్పి, అసౌకర్యాన్ని అనుభవిస్తున్నట్లు వైద్యులతో చెప్పాడు. అయితే అతడు ఎప్పుడూ ఆ నొప్పి గురించి వైద్యుల వద్దకు వెళ్ళలేదు. చివరకు 9 సంవత్సరాల తర్వాత డాక్టర్ వద్దకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. CT స్కాన్ చేయించుకున్నాడు. అప్పుడు కాలేయం కుడి వైపున ఒక పదునైన వస్తువు ఇరుక్కుపోయిందని గుర్తించారు.

కాలేయం నుండి తీసిన 9 సెంటీమీటర్ల పొడవు గాజు ముక్క

ఎప్పుడు ఏదైనా గాయం అయ్యిందా అని వైద్యులు రోగిని అడిగినప్పుడు.. రోగి తనకు ఎలాంటి గాయం అయిన గుర్తు లేదని.. ఏదో పదునైన వస్తువు తనకు గుచ్చుకున్న సంఘటన గుర్తు లేదని చెప్పాడు. తరువాత వైద్యులు రోగికి ల్యాప్రోస్కోపిక్ ఆపరేషన్ చేసి అతని కాలేయం నుంచి 9 సెంటీమీటర్ల పొడవైన గాజు ముక్కను తొలగించారు.

ఇవి కూడా చదవండి

బ్రతకడం అదృష్టం

నివేదికల ప్రకారం రోగికి శస్త్రచికిత్స చేసిన ఒక వైద్యుడు ‘ఎండోస్కోపిక్ మానిటర్‌పై పదునైన అంచులతో 88x15x7 మిల్లీ మీటర్ గాజు ముక్కను చూసినప్పుడు మేము షాక్ అయ్యాము అని చెప్పారు. కాలేయంలో పదునైన వస్తువు ఇరుక్కుపోయి 9 సంవత్సరాలకు పైగా జీవించి ఉన్న వ్యక్తి చాలా అదృష్టవంతుడని..ఎందుకంటే అతని కాలేయానికి గాయం అయినా అతనికి ఏమీ జరగ పోవడం వింత అని చెప్పారు. ఇప్పుడు ఈ కేసు రష్యన్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఆ వ్యక్తి ఇన్నాళ్లు ఆ బాధను ఎలా భరించాడో అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.

 

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..