Toxic Lady: ప్రపంచంలో విషపూరిత మహిళ.. నేటికీ సైన్స్ ఛేదించని మిస్టరీ.. టాక్సిక్ లేడీ మరణం గురించి మీకు తెలుసా..

విషపు మహిళగా ప్రపంచానికి తెలిసిన మహిళ అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన గ్లోరియా రామిరెజ్.  ఆమెను మీడియా 'టాక్సిక్ ఉమెన్'గా అభివర్ణించింది. 1994లో రివర్‌సైడ్ జనరల్ హాస్పిటల్‌లోని చాలా మంది సిబ్బంది గ్లోరియాతో పరిచయం ఏర్పడిన వెంటనే స్పృహతప్పి పడిపోయారు. గ్లోరియా సర్వైకల్ క్యాన్సర్ చివరి దశలో ఉన్నప్పుడు ఎమర్జెన్సీ వార్డులో చేరింది.

Toxic Lady: ప్రపంచంలో విషపూరిత మహిళ.. నేటికీ సైన్స్ ఛేదించని మిస్టరీ.. టాక్సిక్ లేడీ మరణం గురించి మీకు తెలుసా..
Gloria Ramirez

Updated on: Feb 09, 2024 | 8:53 PM

ఎవరైనా సరే ‘రసాయన బాంబు’గా మారి తన ఉనికితో వాతావరణాన్ని విషపూరితం చేసి ఎంతో మంది మరణానికి కారణం అవ్వాలని భావిస్తారా.. అందునా ఒక స్త్రీ తనకు తెలియకుండానే రసాయన బాంబు గా మారింది. దీంతో ఆమెను ఎవరైనా సంప్రదించిన వెంటనే.. వారి ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమవుతుంది. ఇది వినడానికి సినిమా స్టోరీ అనిపించవచ్చు. అయితే నిజ జీవితంలో జరిగింది. ఆ మహిళ చనిపోయి మరీ అనేక  మంది జీవితాలను నాశనం చేసింది. ఈ మహిళ ప్రపంచానికి ‘విషపు మహిళ’ అని తెలుసు.

విషపు మహిళగా ప్రపంచానికి తెలిసిన మహిళ అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన గ్లోరియా రామిరెజ్.  ఆమెను మీడియా ‘టాక్సిక్ ఉమెన్’గా అభివర్ణించింది. 1994లో రివర్‌సైడ్ జనరల్ హాస్పిటల్‌లోని చాలా మంది సిబ్బంది గ్లోరియాతో పరిచయం ఏర్పడిన వెంటనే స్పృహతప్పి పడిపోయారు. గ్లోరియా సర్వైకల్ క్యాన్సర్ చివరి దశలో ఉన్నప్పుడు ఎమర్జెన్సీ వార్డులో చేరింది.

ఇవి కూడా చదవండి

మీడియా నివేదికల ప్రకారం ఒక నర్సు తన శరీరం నుండి వెల్లుల్లి వంటి వింత వాసన వస్తుందని మొదట నివేదించింది. అనంతరం వైద్యులు, నర్సులతో సహా చాలా మంది వైద్య సిబ్బందికి తల తిరగడం, వికారం అనిపించడం ప్రారంభమైంది. చాలా మంది స్పృహ తప్పి పడిపోయారు. కొందరు తమ నోటిలో లోహపు రుచి ఉన్నట్లు వెల్లడించారు.

తర్వాత పరిస్థితి మరింత దిగజారడంతో ఆసుపత్రి అత్యవసర వార్డును ఖాళీ చేయవలసి వచ్చింది. ప్రమాదకర పదార్థాలను పరిశోధించడానికి వెంటనే ఒక బృందాన్ని పిలిచారు. అయితే వారికి ఏమీ అర్థం కాలేదు. ఈ వింత పరిస్థితి వెనుక విషపూరితమైన గ్లోరియా రక్తమే కారణమని తర్వాత తేలింది.

వైద్యుల ప్రకారం గ్లోరియా రక్తం అసాధారణ రసాయన కూర్పును కలిగి ఉంది. సిరలు ఒక విచిత్రమైన జిడ్డుగల పదార్ధంతో నిండి ఉన్నాయి. తరువాత దీనిని డైమిథైల్ సల్ఫాక్సైడ్ (DMSO)గా గుర్తించారు. అయితే, ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, వైద్యులు గ్లోరియాను రక్షించలేకపోయారు. ఆ మహిళ చేరిన కొద్ది గంటలకే మరణించింది.

1994లో గ్లోరియా రామిరేజ్ రివర్‌సైడ్ జనరల్ హాస్పిటల్‌లోని ఎమర్జెన్సీ వార్డ్ కు తీసుకుని వచ్చారు. ఆమెకు చికిత్స చేస్తున్న సమయంలో చాలా మంది ఆసుపత్రి సిబ్బంది అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు.  మూర్ఛ, వికారం, కండరాల నొప్పులు వంటి లక్షణాలతో ఇబ్బంది పడ్డారు.

మొదట, ఒక నర్సు ఒక విచిత్రమైన, వెల్లుల్లి లాంటి వాసనను నివేదించింది

అయితే గ్లోరియాలోని విషపూరిత రక్తం రహస్యం ఇప్పటికీ ఛేదించలేని రహస్యంగా మిగిలిపోయింది. ఆమె  మరణం తరువాత, అనేక సిద్ధాంతాలు ఉద్భవించాయి. వాటిలో ఒకటి ఆమె రక్తంలో ఉన్న DMSO రసాయనం.. క్యాన్సర్ చికిత్స కూడా ఒక కారణమని భావించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..