ఈ రోజుల్లో ఇల్లు కొనడం ఎంత కష్టమో ప్రతి ఒక్కరికీ తెలుసు. అది గ్రామం లేదా నగరం కావచ్చు.. భూమి ధరలు చాలా వేగంగా పెరుగుతున్నాయి. సాధారణ వ్యక్తి రెండు గదుల ఇల్లు కొనడం కూడా కష్టంగా మారింది. ఇది భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా కనిపిస్తుంది. భూముల ధరలు ఆకాశాన్నంటుతున్న ప్రాంతాలు ప్రపంచంలో అనేక ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో అతితక్కువ ధరకు రెడీమేడ్ ఇల్లు దొరుకుతుంటే ఎలా ఉంటుందో ఊహించండి. అవును ఇంగ్లండ్‌లోని న్యూకాజిల్‌లో ఇలాంటిదే కనిపిస్తుంది. ఇక్కడ నాలుగు బెడ్‌రూమ్‌లు ఉన్న ఇంటిని కేవలం 1 పౌండ్ అంటే కేవలం 105 రూపాయలకు విక్రయిస్తున్నారు.
ఈ ఇంట్లో నాలుగు గదులు, రెండు బాత్‌రూమ్‌లు, లాంజ్, కిచెన్ ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు పిల్లలు ఆడుకోవడానికి యార్డ్ కూడా ఉంది. అంతేకాదు కారు ఉంచడానికి గ్యారేజీని కూడా నిర్మించారు. కిటికీలు, తలుపులు పుష్కలంగా ఉండడంతో ఇంట్లోకి చల్లని గాలి వస్తూ ఆహ్లాదకరంగా ఉంటుంది. ది సన్ నివేదిక ప్రకారం ఈ ఇంటికి సమీపంలో ప్రజా రవాణా సౌకర్యం కూడా ఉంది. ఇన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ ఈ ఇల్లు కేవలం 105 రూపాయలకు అమ్మకానికి పెట్టారు. ఈ ఇంటిని ప్యాటిన్సన్ ఎస్టేట్ ఏజెన్సీ ద్వారా అమ్మకానికి పెట్టారు.
ఇంటిని కొనుగోలు చేస్తే రూ.7 లక్షల బోనస్
ఆసక్తికరమైన విషయమేమిటంటే ఈ ఇంటిని ఎవరు కొనుగోలు చేసినా 7 వేల పౌండ్లు అంటే దాదాపు 7 లక్షల 40 వేల రూపాయల బోనస్ కూడా లభిస్తుంది. ఇంత చవకైన ఇల్లు, దాని పైన లక్షల బోనస్ ప్రకటించినా ఎవరూ ఎందుకు కొనడం లేదని ఇప్పుడు మీరు ఆశ్చర్యపోతున్నారా.. దీనికి కారణం ఈ ఇల్లు చాలా మురికిగా ఉండటమే. ఇంటి పై కప్పు మొత్తం లేచిపోవడమే కాదు.. ఇంట్లోని వాల్ పేపర్లన్నీ కూడా తొలగిపోయి పడకగది నుంచి బాత్ రూం వరకు ఎక్కడికక్కడ అపరిశుభ్రత నెలకొంది. ఈ కారణంగానే ఈ ఇంటి ధర ఇంత తక్కువగా ఉంచబడింది.
శిథిలావస్థకు చేరుకున్న ఇల్లు
ప్యాటిన్సన్ ఎస్టేట్ ఏజెన్సీ ప్రతినిధి మాట్లాడుతూ.. ఈ ఇంట్లో ఉన్న గ్రాండ్ పియానో విలువ 7 వేల పౌండ్‌ల వరకు ఉంటుందని అయితే ఆస్తి విలువ కేవలం ఒక పౌండ్‌గా ఉంచబడింది. ఈ ఇల్లు న్యూకాజిల్ సెంట్రల్ స్టేషన్ నుండి కేవలం 1.4 మైళ్ల దూరంలో ఉంది. ఆస్తి శిథిలావస్థకు చేరినందున ఈ ఇంటికి సరైన వాల్యుయేషన్ కట్టడం అసాధ్యం అని ఏజెంట్ చెప్పాడు. అందుకే దీన్ని విక్రయించేందుకు వేలం సరైన మార్గంగా ఎంచుకున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..