10 గంటలు, 10 కిలోలు ఆహారం తినే యువతి.. లైవ్ స్ట్రీమింగ్‌లో ఆహారం తింటూ మృతి.. ఎక్కడంటే

|

Jul 22, 2024 | 6:50 PM

చైనాలో 24 ఏళ్ల యువతి విషయంలో అలాంటిదే జరిగింది. చైనాకు చెందిన మహిళ పేరు పాన్ జియోటింగ్. వాస్తవానికి ఆ మహిళ ముక్‌బాంగ్ స్ట్రీమ్ లో నిపుణురాలు. అంటే ప్రేక్షకుల ఆనందం కోసం భారీ మొత్తంలో ఆహారం తినడం. అయితే ఇటీవల ఆమె అలా చేస్తూ హఠాత్తుగా మరణించింది. ఆ సమయంలో ఆమె లైవ్ స్ట్రీమింగ్ లో ఆహారం తింటూ ఉండడం ఆశ్చర్యకరమైన విషయం.

10 గంటలు, 10 కిలోలు ఆహారం తినే యువతి.. లైవ్ స్ట్రీమింగ్‌లో ఆహారం తింటూ మృతి.. ఎక్కడంటే
Chinese Mukbang Streamer
Follow us on

కొంతమందికి ఆహరం తినడం అత్యంత ఇష్టమైన పని. కొంతమంది రకరకాల ఆహారాన్ని చాలా ఇష్టంగా తింటారు. ఆహారం తినడానికి ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. అంతేకాదు ఆహారం తిన్న తర్వాత కూడా రకరకాల ఆహార పదార్ధాలను తినడానికి వెనుకాడరు. అయితే ఇలా తినడం కొన్నిసార్లు ప్రమాదకరమని రుజువు చేస్తుంది. చైనాలో 24 ఏళ్ల యువతి విషయంలో అలాంటిదే జరిగింది. చైనాకు చెందిన మహిళ పేరు పాన్ జియోటింగ్. వాస్తవానికి ఆ మహిళ ముక్‌బాంగ్ స్ట్రీమ్ లో నిపుణురాలు. అంటే ప్రేక్షకుల ఆనందం కోసం భారీ మొత్తంలో ఆహారం తినడం. అయితే ఇటీవల ఆమె అలా చేస్తూ హఠాత్తుగా మరణించింది. ఆ సమయంలో ఆమె లైవ్ స్ట్రీమింగ్ లో ఆహారం తింటూ ఉండడం ఆశ్చర్యకరమైన విషయం.

ఆడిటీ సెంట్రల్ అనే వెబ్‌సైట్ నివేదిక ప్రకారం చైనా 2020 సంవత్సరంలో ముక్‌బాంగ్ స్ట్రీమ్‌లు, వీడియోలపై విరుచుకుపడింది. ఇలా చేసే వ్యక్తులకు 10 వేల యువాన్లు అంటే దాదాపు లక్షా 17 వేల రూపాయల వరకు జరిమానా విధించబడుతుంది. అయినప్పటికీ చైనాతో సహా అనేక ఆసియా దేశాలలో ‘ముక్‌బాంగ్ స్ట్రీమ్’ ఇప్పటికీ బాగా ప్రాచుర్యం పొందింది. ఈ కార్యక్రమంలో వేలాది మంది ప్రజలు తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ ఆహారాన్ని తింటారు. అలాంటి వారిలో పాన్ జియోటింగ్ కూడా ఒకరు. ఆమె మొదట వెయిట్రెస్‌గా పనిచేసింది. తరువాత ప్రొఫెషనల్ ముక్‌బాంగర్‌గా మారింది.

అతిగా తినడం అనే అలవాటుతో ఆ మహిళ తన జీవితాన్ని కోల్పోయింది. శరీరం అదనపు ఆహారాన్ని తట్టుకోలేకపోయింది. ప్రత్యక్ష ప్రసారంలో పాన్ జియోటింగ్ తన ప్రాణాలను కోల్పోయింది. జీర్ణం కాని ఆహారంతో కడుపు నిండిపోయిందని.. కడుపు బాగా వికృతంగా మారిందని పోస్టుమార్టంలో తేలింది.

ఇవి కూడా చదవండి

వృత్తిరీత్యా ముక్‌బంగర్‌గా మారిన మహిళ

నివేదికల ప్రకారం ఇతర విజయవంతమైన ముక్‌బాంగ్ స్ట్రీమర్‌లు చాలా ఆహారం తినడం, తమ అభిమానుల నుంచి బహుమతులు పొందడం. వీడియోలను చేయడం ద్వారా చాలా డబ్బు సంపాదించడం చూసిన తర్వాత పాన్ జియోటింగ్ కు ఒక ప్రొఫెషనల్ ముక్‌బాంగర్ అవ్వాలనే ఆలోచన వచ్చింది. ఆ తర్వాత తాను కూడా ప్రయత్నించాలని నిర్ణయించుకుంది. ప్రారంభంలో పాన్ జియోటింగ్ ఎక్కువ ఆహారం తినడం, ఫ్యాన్స్ ను సంపాదించుకోవడంలో చాలా కష్టాలను ఎదుర్కుంది. అయితే కాలక్రమంలో పరిస్థితులు మెరుగుపడ్డాయి. అయినప్పటికీ పాన్ జియోటింగ్ కి ఆహారం తినడం వ్యసనంగా మారింది. దీంతో ఆమె బరువు 300 కిలోలకు పెరిగింది. అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరవలసి వచ్చింది.

ప్రతి స్ట్రీమింగ్ సమయంలో 10 కిలోల ఆహారాన్ని తినే పాన్ జియోటింగ్

ఆడిటీ సెంట్రల్ నివేదిక ప్రకారం రోజుకు కనీసం 10 గంటలు నిరంతరంగా పాన్ జియోటింగ్ ఆహారాన్ని తినేది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆమె ప్రతి స్ట్రీమింగ్ సెషన్‌లో 10 కిలోల కంటే ఎక్కువ ఆహారాన్ని తినేది. ఫలితంగా ఇప్పుడు ఆమె మరణించింది. ఆమె మరణానికి సంబంధించిన ఖర్చితమైన కారణం బహిరంగ ప్రకటన చేయనప్పటికీ, పోస్ట్‌మార్టం సమయంలో ఆమె మృతదేహాన్ని పరిశీలించినప్పుడు ఆమె కడుపులో చాలా ఆహారం ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె తిన్న ఆహరం జీర్ణం అవ్వక పోవడంతో మృతి చెందిందని తెలుస్తోంది.

 

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..