Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: ఎంతపని చేశావే దున్నపోతా.. 1.5 లక్షల విలువైన బంగారం మింగేసింది..

Buffalo Swallow Gold Ornaments: మనుషులకు ఆకలేస్తే ఆహారం తింటారు.. పశువులకు ఆకలేస్తే గడ్డి తింటాయి.. దీని గురించి స్పెషల్‌గా చెప్పుకోవాల్సిందే ఏమీ లేదు. అయితే కొన్నిసార్లు మనం పొరపాటుగా నోట్లో కాయిన్స్, గోళీలు, ఇతర వుస్తువులను పెట్టుకుంటాం. పొరపాటున వాటిని మింగేస్తాం. ఈ తరహా ఘటనలు చిన్నపిల్లల్లో ఎక్కువగా చూస్తుంటాం.

Viral News: ఎంతపని చేశావే దున్నపోతా.. 1.5 లక్షల విలువైన బంగారం మింగేసింది..
Buffalo Swallos Gold
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 04, 2023 | 8:10 AM

Buffalo Swallow Gold Ornaments: మనుషులకు ఆకలేస్తే ఆహారం తింటారు.. పశువులకు ఆకలేస్తే గడ్డి తింటాయి.. దీని గురించి స్పెషల్‌గా చెప్పుకోవాల్సిందే ఏమీ లేదు. అయితే కొన్నిసార్లు మనం పొరపాటుగా నోట్లో కాయిన్స్, గోళీలు, ఇతర వుస్తువులను పెట్టుకుంటాం. పొరపాటున వాటిని మింగేస్తాం. ఈ తరహా ఘటనలు చిన్నపిల్లల్లో ఎక్కువగా చూస్తుంటాం. మనుషులే కాదు.. కొన్నిసార్లు జంతువులు కూడా ఇలాంటి పొరపాట్లు చేస్తుంటాయి. మనం ఇళ్లలో పెంచుకునే జంతువులు.. దొడ్డిలో కట్టేసినప్పుడు గడ్డితో పాటు.. నోటికి ఏది అందితే దానిని టేస్ట్ చేస్తుంటాయి. ముఖ్యంగా గోదెలు.. తమ నాలుకతో వాటిని రుచి చూస్తుంటాయి. తాజాగా ఓ గేదె ఇలా రుచి చూస్తే ఏకంగా ఓ మహిళ మెడలోంచి బంగారు మంగళసూత్రాన్ని మింగేసింది. దాదాపు రూ. 1.5 లక్షల విలువైన మంగళసూత్రాన్ని గుటుక్కున మింగేసింది. ఇందుకు సంబంధించిన ఇంట్రస్టింగ్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లాలో విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. ఓ గేదె ప్రమాదవశాత్తూ ఖరీదైన బంగారు మంగళసూత్రాన్ని మింగేసింది. ఈ బంగారం ‘మంగళసూత్రం’ విలువ సుమారు రూ. 1.5 లక్షలు ఉంటుందని చెబుతున్నారు. ఈ బంగారు మంగళసూత్రం 20 గ్రాముల పైనే ఉంటుందట. ఓ మహిళ స్నానానికి వెళ్లే ముందు సోయాబీన్, వేరుశెనగ తొక్కలు నింపిన ప్లేట్‌లో నగలను పెట్టింది. అయితే, స్నానం చేసి వచ్చిన తరువాత తన బంగారు ఆభరణాన్ని గేదె తినడానికి పెట్టిన ప్లేట్‌లో పెట్టిన విషయాన్ని మరిచిపోయింది. ఆ తరువాత ఆ పీల్స్‌ను గేదె ముందు పెట్టి తన పనిలో తాను నిమగ్నమైపోయిది.

అయితే, కొన్ని గంటల తరువాత తన మెడలో మంగళసూత్రం లేని విషయాన్ని గుర్తించింది. వెంటనే ఎక్కడ పెట్టానా? అని వెతికింది. గేదెకు మేత పెట్టే ప్లేట్‌లో మంగళసూత్రం పెట్టినట్లు గుర్తుకు వచ్చింది. వెంటనే వెళ్లి చూడగా.. అప్పటికే గేదె మొత్తం మేతను తినేసింది. అక్కడ మంగళసూత్రం ఏమీ లేదు. దాంతో ఆ మంగళసూత్రాన్ని గేదె తినేసిందని భావించింది. వెంటనే మెటర్నటి డాక్టర్‌ వద్దకు గేదెను తీసుకెళ్లగా.. వారు పరిశీలించారు. మంగళసూత్రం గెద కడుపులోనే ఉన్నట్లు గుర్తించారు. మరుసటి రోజు గేదెకు రెండు గంటల పాటు శస్త్రచికిత్స చేసి కడుపులో ఉన్న మంగళ సూత్రాన్ని బయటకు తీశారు. ఈ ఘటనకు సంబంధించిన వార్త ఇప్పుడు వైరల్‌గా మారింది.

మరిన్ని హ్యూమన్ ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..