
ఫస్ట్ నైట్ తర్వాత రోజే నవ దంపతులు విడిపోయారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో చోటుచేసుకుంది. ఇటీవలె వధువు, వరుడికి వివాహం జరిగింది. వివాహం జరిగిన ఆరవ రోజున దంపతులిద్దరికీ శోభనం కార్యక్రమం నిర్వహించారు. అయితే వరుడు చేసిన పనికి వధువు కోపం నశాలానికి అంటింది. వధువుకు తెలియకుండా కూల్‌డ్రింక్‌లో బీరు, పాలలో మత్తుమందు కలిపి తాగించాడు. ఈ విషయాన్ని వధువు తన తల్లిదండ్రులకు చెప్పడంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చివరికి ఇరు కుటుంబాలు పెళ్లి రద్దు చేసుకున్నాయి.
మీర్జాపూర్ జిల్లాలోని కచ్వాన్‌కు చెందిన యువకుడితో వారణాసి జిల్లాలోని కప్సేథికి చెదిన యువతికి మే 15న వివాహం జరిగింది. ఇరు కుటుంబాలకు చెందిన సాంప్రదాయక వివాహ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్నాక ఆరవ రోజున ఇద్దరికి ఫస్ట్ నైట్ అరేంజ్ చేశారు. తనను మోసం చేసి డ్రగ్స్ ఇచ్చారని తెలుసుకున్న వధువు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వెంటనే ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలియజేసింది. దీంతో వెంటనే వధువు కుటుంబ సభ్యులు ఆమెను అత్తారింటి నుంచి పుట్టినింటికి తీసుకెళ్లారు.
అనంతరం వధువు తన తల్లిదండ్రులతో కలిసి కప్సేథి పోలీస్ స్టేషన్‌లో వరుడిపై ఫిర్యాదు చేసింది. కానీ ఈ సంఘటన మీర్జాపూర్‌లోని కచ్వా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో జరిగిందని చెప్పి పోలీసులు కేసు నమోదు చేయడానికి నిరాకరించారు. దీని తరువాత, వధువు తన కుటుంబంతో కలిసి కచ్వా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని అక్కడ ఫిర్యాదు చేసింది.
పోలీసులు ఇరువర్గాలను పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. ఇరు కుటుంబాలకు నచ్చజెప్పేందకు చాలా సేపు ప్రయత్నించారు. అయితే పంచాయితీలో ఇరు కుటుంబాలు రాజీకి రాలేకపోయారు. చివరికి వివాహం విచ్ఛిన్నమైంది. బాధితురాలి ఆరోపణ ఆధారంగా రెండు వర్గాలను పోలీస్ స్టేషన్‌కు పిలిపించినట్లు కచ్వా ఎస్‌హెచ్‌ఓ రణ్‌విజయ్ సింగ్ తెలిపారు. భార్య తన భర్తతో కలిసి జీవించడానికి సిద్ధంగా లేనందున వివాహం రద్దు చేసుకన్నట్లు తెలిపారు.