భారతీయ వివాహ వ్యవస్థలో బిన్నమైన వాతావరణం నెలకొంది. ఓ వైపు కట్నం సరిపోలేదంటూ డిమాండ్ చేసే వరుడు, వరుడి తల్లిదండ్రులు… మరోవైపు తమ పిల్లని ఇవ్వాలంటే వరుడుకీ లక్షల జీతం, కోట్ల ఆస్తులు ఉండాలని గొంతెమ్మ కోర్కెలు కోరే వధువు తల్లిదండ్రులు.. ఇలా రకరకాల వ్యక్తులకు సంబంధించిన వార్తలు వింటూనే ఉన్నాం.. తాజాగా ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారిన పోస్ట్ ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. ఓ మహిళ తనకు వరుడు కావాలని.. అయితే కండిషన్స్ అప్లై అంటూ ఓ పోస్ట్ చేసింది. అందులో తనకు కాబోయే భర్తలకు ఏడాదికి రూ.30 లక్షలు జీతం రావాలని.. ఆ యువకుడికి తల్లిదండ్రులు ఉండకూడదని, 3 బిహెచ్‌కే ఇల్లు కావాలని పోస్ట్‌లో పేర్కొంది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది.
వరుడు కావాలని అంటూ ఓ పోస్ట్ చేసిన మహిళ BEd డిగ్రీ చదువుకుంది. ఉద్యోగం చేస్తూ సంవత్సరానికి రూ. 1.3 లక్షలు సంపాదిస్తోంది. అంతేకాదు ఇందుకు ముందు పెళ్లి భర్తతో వివాదాలు ఏర్పడి విడాకులు కూడా తీసుకుంది. అయితే ఇప్పుడు ఆ మహిళ రెండో పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. అందుకోసం వరుడు కావాలంటూ ఆన్ లైన్ లో ఓ ప్రకటన ఇచ్చింది. అందులో తనకు కాబోయే వరుడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, MBA, MS చేసి కనీసం సంవత్సరానికి రూ. 30 లక్షల వార్షిక వేతనం కలిగి ఉండాలని.. ఆ యువకుడు భారతదేశం, యుఎస్ లేదా యూరప్‌లో పని చేయాలనీ జీవిత భాగస్వామి కోసం వెతుకుతోంది.
పెళ్లి చేసుకోవడానికి రూ. 30 లక్షలు ఉంటే సరిపోదు.. అతనికి తల్లిదండ్రులు ఉండకూడదు.. ఒకవేళ అతనికి తల్లిదండ్రులు ఉంటే పెళ్లి తర్వాత అతనితో తల్లిదండ్రులు ఉండకూడదు లేదా విడివిడిగా ఉండాలని చెప్పింది. ఇక ఉండడానికి సొంతంగా 3 bhk ఇల్లు ఉండాలి. ఇంటి పనులు చేయడానికి ఎప్పుడూ ఒక పని మనిషి అందుబాటులో ఉండాలి. ఇలాంటి అర్హతలు ఉన్న వరుడి ఉంటె తనని సంప్రదించాలని పేర్కొంది ఆ మహిళ.
Her qualities and salary 🤡
Expected husbands qualities and salary🗿🗿 pic.twitter.com/NGgJvVvN9l— ShoneeKapoor (@ShoneeKapoor) September 10, 2024
యువతి గొంతెమ్మ కోర్కెలపై ప్రస్తుతం ఆన్‌లైన్‌లో చర్చ మొదలైంది. ఆ మహిళ విడాకులు తీసుకుంది.. అయినా పెళ్లి కాని యువకుడి కోసం వెదుకుతోంది. అంతేకాదు ఆ మహిళ తల్లిదండ్రులు ఆమెతో ఉంటారు.. కానీ అత్తమామలు వద్దు అంటూ పోస్ట్ చూసిన వారు కామెంట్స్ చేస్తున్నారు.
ఈ రోజుల్లో పెళ్లి అనేది వ్యాపార ఒప్పందం లాంటిదని మరొకరు చెప్పగా, ఆమెకు చాలా అంచనాలు ఉన్నాయని మరొకరు రాశారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..