Trending: ఇది మాములు స్కెచ్ కాదు భయ్యా. ఈజీ మనీ కోసం మాస్టర్ స్కెచ్ వేశారు. ప్లాన్ అంతా బాగా అమలు చేశారు. అంతా బాగానే వర్కువుట్ అయ్యింది. మనీ కూడా అనుకున్న రేంజ్‌లో రావడం స్టార్టయ్యింది. కానీ పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో కథ అడ్డం తిరిగింది. ఉత్తర ప్రదేశ్( Uttar Pradesh)లోని ఉన్నావ్(Unnao) సమీపంలోని మహమూద్‌పూర్ గ్రామంలో ఈ ఆసక్తికర ఘటన వెలుగుచూసింది. అశోక్ కుమార్ అనే వ్యక్తి తన కొడుకులు రవి, విజయ్ సాయంతో హిందూ దేవుళ్లకు సంబంధించిన విగ్రహాలను అమెజాన్‌లో కొనుగోలు చేశాడు. వాటిని తన వ్యవసాయ క్షేత్రంలో పాతిపెట్టారు. ఆ తర్వాత కలలో దైవం కనిపించి.. తమ పొలంలో పలానా చోట తవ్వమన్నదని చెప్పారు. అందర్నీ తీసుకుని ముందుగా విగ్రహాలు పాతిపెట్టిన చోట తవ్వారు. అలా తమ పొలంలో పురాతన దేవుళ్ల విగ్రహాలు బయటపడ్డాయని జనాల్ని బురిడి కొట్టించాడు. ఇంకేముందు జనాలు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. ఆ పొలం వద్దకు వెళ్లి విగ్రహాలకు పూజలు చేశారు. ప్రసాదాలు, ఫలహారాలు, కానుకలు.. చిన్నపాటి జాతర మొదలయ్యింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా జనాలు భారీగా అక్కడికి తరలిరావడం ప్రారంభించారు.
విషయం తెలియడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. అక్కడ సెటప్ అంతా చూసి వారికి తేడా కొట్టింది. పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయగా.. ఇదంతా చీటింగ్ అని తేలింది. అతను ఆన్‌లైన్‌లో 169 రూపాయలు పెట్టి విగ్రహాలు కొనుగోలు చేశాడు. ఆ తర్వాత కట్టు కథ అల్లి ఆలయ నిర్మాణం పేరుతో భారీగా చందాలు వసూలు చేయాలని ప్లాన్ చేసినట్లు పోలీసుల ఎంక్వైరీలో తేలింది. అందుకు తగ్గట్లుగానే 2 రోజుల్లో 35 వేలు గిట్టుబాటు అయ్యింది. కానీ కాప్స్ ఎంట్రీతో వారి ప్లాన్ బెడిసికొట్టింది.
The man who had delivered the order blew whistle on the elaborate plan to by the family to con gullible villagers. Police intervened and has taken three of the family in custody. pic.twitter.com/kcVMVlaTE4
— Piyush Rai (@Benarasiyaa) September 1, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..