అద్భుతం.. మహారాష్ట్రలో తప్పిపోయిన శునకం.. యజమానిని వెతుక్కుంటూ కర్ణాటకలో ప్రత్యేక్షం.. 250 కిలోమీటర్లు..

|

Jul 31, 2024 | 4:05 PM

ఊర్లో కుక్కలు ఉండటం సహజం.. కానీ.. ఈ గ్రామంలో కొందరు శునకానికి దండ వేసి.. ఊరేగింపు నిర్వహిచారు. అంతేకాకుండా.. విందు భోజనాలు పెట్టారు.. ఎందుకు ఏంటి..? అని తెలుసుకోగా.. తప్పిపోయిన శునకం ఇంటికి వచ్చిందని ఊరు ఊరంతా కలిసి జాతర నిర్వహించింది.. ఈ వింత ఘటన కర్ణాటక బెలగావి జిల్లాలోని నిపాని తాలూకాలోని యమగర్ని గ్రామంలో చోటుచేసుకుంది.

అద్భుతం.. మహారాష్ట్రలో తప్పిపోయిన శునకం.. యజమానిని వెతుక్కుంటూ కర్ణాటకలో ప్రత్యేక్షం.. 250 కిలోమీటర్లు..
Follow us on

ఊర్లో కుక్కలు ఉండటం సహజం.. కానీ.. ఈ గ్రామంలో కొందరు శునకానికి దండ వేసి.. ఊరేగింపు నిర్వహిచారు. అంతేకాకుండా.. విందు భోజనాలు పెట్టారు.. ఎందుకు ఏంటి..? అని తెలుసుకోగా.. తప్పిపోయిన శునకం ఇంటికి వచ్చిందని ఊరు ఊరంతా కలిసి జాతర నిర్వహించింది.. ఈ వింత ఘటన కర్ణాటక బెలగావి జిల్లాలోని నిపాని తాలూకాలోని యమగర్ని గ్రామంలో చోటుచేసుకుంది.. కొంత మంది కలిసి ఒక నల్ల శనకానికి పూలమాల వేసి.. ఊరేగింపు నిర్వహించడంతోటు విందును ఏర్పాటు చేశారు. తప్పిపోయిన గ్రామ సింహం (మహరాజ్).. తిరిగి రావడం గ్రామస్తులకు అద్భుతంగా అనిపించింది. దీంతో వేడుక నిర్వహించారు.

దక్షిణ మహారాష్ట్రలోని తీర్థయాత్రల పట్టణం పండరీపూర్‌లో మహారాజ్ అనే శునకం జనసమూహంలో తప్పిపోయింది.. ఆ తర్వాత కొన్నిరోజుల పాటు 250 కిలోమీటర్ల పాటు ప్రయాణించి ఉత్తర కర్నాటకలోని బెలగావిలోని గ్రామానికి తిరిగి వచ్చింది..

జూన్ చివరి వారంలో పాదయాత్రగా పండరీపూర్‌ కు వెళ్లినప్పుడు శనకం (మహరాజ్) యజమాని కమలేష్ కుంభార్‌ని అనుసరించింది.. ప్రతి సంవత్సరం ఆషాఢ ఏకాదశి, కార్తీక ఏకాదశి నాడు తాను పండర్‌పూర్‌ని సందర్శిస్తానని.. ఈసారి కుక్క కూడా తనతో పాటు వచ్చిందని కుంభార్ చెప్పాడు.

“మహారాజ్‌కి ఎప్పుడూ భజనలు వినడం ఇష్టం. ఒకసారి, అతను మహాబలేశ్వర్ సమీపంలోని జ్యోతిబా ఆలయానికి మరో పాదయాత్రలో నాతో కలిసి వచ్చాడు” అని కుంభార్ పిటిఐకి చెప్పారు. దాదాపు 250 కి.మీల పాటు, తన స్నేహితుల బృందంతో కలిసి భజనలు చేస్తూ నడిచిన కుంభార్ ను కుక్క అనుసరించింది. ఆ తర్వాత విఠోబా ఆలయంలో దర్శనం అనంతరం కుక్క కనిపించకుండా పోయిందని కుంభార్ తెలిపారు. అతను దాని కోసం వెతుకుతున్నప్పుడు.. కుక్క మరికొన్ని శునకాలతో కలిసి వెళ్లిపోయిందని అక్కడ ఉన్న వ్యక్తులు చెప్పారని తెలిపాడు.

అయినప్పటికీ.. తాను చాలాచోట్ల వెతికానని కానీ.. కనిపించలేదు.. దీంతో జూలై 14న తన స్వస్థలానికి తిరిగి వచ్చానని.. కుంభార్ వివరించాడు.. మరుసటి రోజు ఇంటి దగ్గర మహరాజ్ ను చూసి ఆశ్చర్యపోయానని.. కుంభర్ తెలిపాడు.. మహారాజ్ నా ఇంటి ముందు నిలబడి, ఏమీ జరగనట్లుగా తోక ఊపుతూ కనిపించింది.. సంపూర్ణంగా బాగుంది.. మంచిగా తిన్నదని తెలిపాడు..

దానిని చూసిన తర్వాత కుంభార్.. గ్రామస్థులు మహారాజ్ తిరిగి వచ్చినప్పుడు విందుతో వేడుక జరుపుకున్నారు. “ఇంటి నుండి 250 కిమీ లేదా అంతకంటే ఎక్కువ దూరంలో ఉన్నప్పటికీ కుక్క తన దారిని కనుగొనడం చాలా అద్భుతం.. దానికి మార్గనిర్దేశం చేసింది పాండురంగ ప్రభువు అని మేము భావిస్తున్నాము.. అంటూ కుంభార్ చెప్పాడు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..