Viral: పాపం! నవ వధువుకు దిమ్మతిరిగే షాక్.. అత్తగారింట్లోకి అడుగు పెట్టకముందే..
నవ వధువుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు అత్తామామలు.. ఎన్నో ఆశలతో అత్తగారింట్లోకి అడుగుపెట్టాలనుకున్న వధువును రోడ్డుపై నిలబెట్టేశారు..
పెళ్లి చేసుకున్న అమ్మాయి.. ఎన్నో ఆశలతో అత్తగారింట్లోకి అడుగుపెడుతుంది. కానీ పాపం! ఈ నవ వధువుకు అత్తగారింట్లోకి అడుగుపెట్టక ముందే దిమ్మతిరిగే షాక్ తగిలింది. అత్తామామలు ఆమె రాగానే ఆహ్వానించాల్సింది పోయి.. తలుపులు మూసేశారు. దానికి కారణం ఉండండి.. ఇక ఆ కారణం ఏంటో మీరు తెలుసుకుంటే.. ఆమె అత్తామామలను తిట్టిపోస్తారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని రాయిబరేలిలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. రాయిబరేలికి చెందిన వీరేంద్ర సొంకర్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి ఇంట్లోకి సతీసమేతంగా అడుగుపెట్టాలనుకున్నాడు. అయితే అతడికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు వాళ్ల తల్లిదండ్రులు.. నవ వధూవరుల ముఖంపై తలుపులు వేసి.. లోపలికి అనుమతించేది లేదంటూ కయ్యానికి కాలు దువ్వారు. పాపం.! నవ వధువు, వరుడు ఇద్దరూ కూడా ఎండలో చాలాసేపు బయటే కూర్చున్నారు. సమయం గడుస్తున్నా.. వరుడి తల్లిదండ్రులు తలుపులు తీయకపోయేసరికి.. అతడి అత్త.. వధూవరులకు ఆశ్రయాన్ని ఇచ్చింది.
అసలు జరిగిన స్టోరీ ఇది:
పెళ్లి రోజు రాత్రి వధువు కుటుంబీకులకు వరుడి కుటుంబానికి మధ్య పెద్ద గొడవ జరిగింది. దీనితో వరుడి తండ్రి, తల్లి, సోదరుడు, సోదరి రాత్రికి రాత్రే వాళ్ల ఇంటికి చేరుకున్నారు. మరుసటి రోజు వరుడు వీరేంద్ర తన భార్యతో కలిసి ఇంటికి తిరిగి వచ్చేందుకు సిద్దమవుతుండగా.. అతడి తండ్రి ఫోన్ చేసి.. పెళ్లికూతురుతో కలిసి రావద్దని హెచ్చరించాడు. అయితే వీరేంద్ర అతడి తండ్రి మాట పట్టించుకోకుండా తన భార్యతో కలిసి ఇంటికి చేరుకున్నాడు. వాళ్ళిద్దరిని అవమానిస్తూ.. వరుడి కుటుంబం వాళ్లను ఇంటి బయట నిల్చోపెట్టారు. కట్నంగా ఇవ్వాల్సిన అపాచీ కారు, యాబై వేల నగదు ఇవ్వకపోవడంతోనే వరుడి కుటుంబం ఇలా చేస్తోందని వధువు కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.