Viral Video: ప్రేమ అనే మధురానుభితిని వర్ణించడానికి అక్షరాలు చాలవంటే అతిశయోక్తి కాదు. ప్రేమను అనుభూతి చెందడమే తప్ప.. అభివర్ణించలేం. యావత్ ప్రపంచం ప్రేమపైనే ఆధారపడి నడుస్తోందని కూడా చెప్పొచ్చు. ఈ ప్రేమ మనుషుల మధ్య కాదు.. జాతివైరం లేకుండా ప్రేమ పుట్టవచ్చు. సజాతుల మధ్య కూడా ప్రేమ చిగురించొచ్చు. తాజాగా రెండు ఏనుగుల మధ్య ప్రేమ చిగురించింది. ఆ ప్రేమానుభూతిని ఆవి మనసారా ఆస్వాదించాయి.
ముఖ్యంగా ప్రేమలో ‘కౌగిలింత’కు ప్రాధాన్యతే వేరు. ప్రేమలోనే కాదు.. ప్రతీ అంశంలోనూ హగ్ ఒక మ్యాజిక్‌లా పని చేస్తుంది. కష్టాల్లో ఉన్న వారిని, డిప్రెషన్‌లో ఉన్న వారిని మనసారా హత్తుకుని కాస్త ధైర్యం చెబితే వారిలో ఎనలేని పాజిటివ్ ఎనర్జీ వస్తుందట. అంతెందుకు తెలుగు సినిమా శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాలో ‘‘జంతర్ మంతర్ చూ మంతర్ కాళి.. అందర్ దర్ద్ దెబ్బకు ఖాళీ..’’ అని మెగాస్టార్ చిరంజీవి చెప్పిన డైలాగ్ ఎంత ఫేమస్ అయ్యిందో మనందరికీ తెలుసు. హగ్ కు ఉండే శక్తి అలాంటిది అని అంటారు. అయితే, ఈ హగ్ మనుషులకే కాదు.. జంతువులకు కూడా ఉంటుంది.
ఈ సంగతి ఇలా ఉంటే.. పైన చెప్పుకున్న రెండు ఏనుగులు కూడా ప్రేమరాగాలను ఆలపిస్తూనే.. కౌగిలింతలను ఆస్వాదిస్తున్నాయి. అలకపూనిన ఏనుగు వద్దకు మరో ఏనుగు వచ్చి.. తన తొండంతో గారాబం చేసింది. దాంతో అలక వీడిన మరో ఏనుగు.. తాను సైతం తొండంతో రొమాన్స్ చేయడం ప్రారంభించాయి. రెండూ తొండాలతో హగ్ చేసుకున్నాయి. అయితే, ఈ బ్యూటీఫుల్ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘ప్రతీ ఒక్కరికీ హగ్ అవసరం’ అని క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ బ్యూటీఫుల్ వీడియోను చూసి నెటిజన్లు ముగ్దులవుతున్నారు. వీడియోకు ఇప్పటి వరకు 23వేల వ్యూస్ రాగా, వందలాది లైక్స్ వచ్చాయి. మరెందుకు ఆలస్యం.. ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
Everyone needs a hug? pic.twitter.com/LRHl7marnd
— Susanta Nanda IFS (@susantananda3) May 16, 2022