
సోషల్ మీడియాలో ప్రతిరోజూ వివిధ వీడియోలు వైరల్ అవుతున్నాయి. వీటిలో కొన్ని వీడియోలు ప్రజలను నవ్విస్తాయి, మరికొన్ని ఆలోచింపజేస్తాయి. అదేవిధంగా ఇటీవలి వీడియో చాలా చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో సంప్రదాయం, విశ్వాసం, ఆధునిక ఆలోచనల మధ్య కొనసాగుతున్న చర్చను తిరిగి రగిలించింది. ఈ రోజు ఈ వీడియో గురించి రగిలిచిన చర్య గురించి తెలుసుకుందాం..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఒక యువతి తన స్నేహితులతో కలిసి పూజ చేసేందుకు గుడికి చేరుకుంది. ఆ సమయంలో ఆ యువతి షార్ట్స్ ధరించి ఉంది. ఆమె లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించగా.. గుడి దగ్గర ఉన్న ఒక సెక్యూరిటీ గార్డు ఆమెను ఆపాడు. ఆలయంలోకి ప్రవేశించడానికి కొన్ని నియమాలు ఉన్నాయని.. వాటిని పాటించాలని గార్డు వివరించాడు. అప్పుడు అక్కడ ఉన్న పూజారులు గార్డుకు మద్దతు ఇచ్చారు. ఆలయ గౌరవాన్ని కాపాడుకోవడానికి డ్రెస్ కోడ్ పాటించడం చాలా అవసరమని వారు పేర్కొన్నారు.
ఇది విన్నతర్వాత ఆ యువతికి కోపం వచ్చింది. తనను అడ్డుకున్న గార్డులు, పూజారులతో వాదించడం ప్రారంభించింది. దేవుడు దుస్తులకు సంబంధించి ఎటువంటి నియమాలను రూపొందించలేదని.. మానవులు ఆ నియమాలను రూపొందించాడని ఆమె పేర్కొంది. తాను దేవుడిని దర్శనం చేసుకోవలనుకుంటే తనను ఎందుకు ఆపుతున్నారని ఆమె ప్రశ్నించింది. తాను వస్త్రధారణ విషయంలో నియమాలను పాటించనని.. తనకు నచ్చినట్లుగా ఆలయంలోకి ప్రవేశిస్తానని ఆమె స్పష్టంగా చెప్పింది.
ఆలయ ప్రాంగణంలో ఈ చర్చ చాలా సేపు కొనసాగింది. ఆలయంలోకి ప్రవేశించే హక్కు అందరికీ ఉందని.. దుస్తులను ధరించడం అనేది సొంత విషయం.. దీనిని బట్టి గుడిలోకి ప్రవేశం లేదు అనడం సరికాదని ఆ యువతి పదే పదే చెప్పింది. అదే సమయంలో ఆలయ గౌరవాన్ని కాపాడటానికి కొన్ని నియమాలు ఏర్పాటు చేయబడ్డాయని.. ప్రతి భక్తుడు వాటిని పాటించాలని పూజారి, గార్డులు ఆ యువతికి చెప్పడానికి ప్రయత్నించారు. చివరికి ఆ యువతి, తన స్నేహితులతో కలిసి దేవుడిని దర్శించుకోకుండానే తిరిగి వెళ్ళేపోయే స్టేజ్ కి చర్చ పెరిగింది. అయితే ఈ సంఘటనని మొత్తం ఆ యువతి చిత్రీకరించింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.
Woman got into a heated argument with the police and the priest after being denied entry for wearing shorts
Hindu temples should have a dress code for both genders. pic.twitter.com/asMegXPBed
— Hindutva Vigilant (@VigilntHindutva) October 1, 2025
ఈ వీడియోను @VigilntHindutva అనే ఖాతా ద్వారా Instagramలో షేర్ చేశారు. దీనిని లక్షలాది మంది వీక్షించారు. వేల మంది లైక్ చేశారు. వీడియో వైరల్ అయిన వెంటనే ప్రజలు రెండు గ్రూపులయ్యారు. ఆలయంలోకి ప్రవేశించడానికి దుస్తులు ఒక ప్రమాణం కాకూడదని ఒక వర్గం వారు కామెంట్ చేస్తున్నారు. దేవుడు అందరికీ చెందినవాడు. ప్రతి ఒక్కరూ తమ ఇష్టానుసారం ఆలయాన్ని సందర్శించే హక్కు కలిగి ఉండాలి. దుస్తులు కంటే విశ్వాసం గొప్పదని వారు వాదిస్తున్నారు. .. అదే సమయంలో మరొక వర్గం ఆ యువతి చర్యలను ఖండిస్తోంది. ఆలయం ఒక పవిత్ర స్థలం అని .. దేవుడి దర్శనం చేసుకోవడానికి క్రమశిక్షణ, మర్యాద అవసరమని అంటున్నారు. ఆలయ వాతావరణం ఆధ్యాత్మికత కొనసాగించడానికి దేవాలయాలకు డ్రెస్ కోడ్ ను పాటించాలని చెబుతున్నారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో రకరకాల స్పందనలకు దారితీసింది. ఒకరు స్త్రీలు ఏమి ధరించాలో ఎవరూ నిర్ణయించకూడదు.. ఆదేశించ కూడదని చెప్పారు. మరొకరు, “ఒక ఆలయంలో సంప్రదాయ దుస్తులు తప్పనిసరి.. ఇలాంటి దుస్తులు ధరించే వారిని ఆపడం సరైందే” అని అన్నారు. పురుషులు, మహిళలు ఇద్దరికీ స్పష్టమైన దుస్తుల నియమావళిని ఏర్పాటు చేయాలని మరికొందరు సూచిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..