Viral Video: ఆన్‌లైన్ మీటింగ్‌లో ఉద్యోగి బిజీబిజీ.. వెనుక నుంచి కొండచిలువ హాజరు.. వీడియో వైరల్

|

Dec 14, 2023 | 5:01 PM

వాస్తవానికి ఒక వ్యక్తి తన ఇంటి ఆవరణలో హాయిగా కూర్చుని ఆన్‌లైన్‌లో తన ఆఫీసు సహోద్యోగులతో మీటింగ్ లో పాల్గొన్నాడు. అయితే అదే సమయంలో ఇంటి పై కప్పు మీద ఒక కొండ చిలువ వేలాడుతూ కనిపించింది. కొలీగ్ తో జరుగుతున్న ఆన్ లైన్ మీటింగ్ లో అతనితో పాటు కొండ చిలువ కూడా హాజరైంది. ఇది చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. అయితే ఆ వ్యక్తి తన మీటింగ్‌తో బిజీగా ఉన్నాడు.

Viral Video: ఆన్‌లైన్ మీటింగ్‌లో ఉద్యోగి బిజీబిజీ.. వెనుక నుంచి కొండచిలువ హాజరు.. వీడియో వైరల్
Python Video Viral
Follow us on

కోవిడ్ మహమ్మారి వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రజల జీవితంలో, పనుల్లో చాలా మార్పులు వచ్చాయి.  వాటిలో ఒకటి ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ అంటే ఇంటి నుండి పని చేసే సౌకర్యం. ఆన్‌లైన్‌లో పని చేసే వీలున్న  చాలా కంపెనీలు తమ ఉద్యోగస్తులకు ఇంటి నుంచి పని చేసే వీలుని కల్పించింది. దీని వల్ల కంపెనీలు కూడా చాలా లాభపడుతున్నాయి. ఆఫీసు ఖర్చుల నుంచి రవాణా ఖర్చుల వరకు అన్నీ ఆదా అవుతున్నాయి. ప్రస్తుతం ‘వర్క్ ఫ్రమ్ హోమ్’కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. దీనిని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

వాస్తవానికి ఒక వ్యక్తి తన ఇంటి ఆవరణలో హాయిగా కూర్చుని ఆన్‌లైన్‌లో తన ఆఫీసు సహోద్యోగులతో మీటింగ్ లో పాల్గొన్నాడు. అయితే అదే సమయంలో ఇంటి పై కప్పు మీద ఒక కొండ చిలువ వేలాడుతూ కనిపించింది. కొలీగ్ తో జరుగుతున్న ఆన్ లైన్ మీటింగ్ లో అతనితో పాటు కొండ చిలువ కూడా హాజరైంది. ఇది చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. అయితే ఆ వ్యక్తి తన మీటింగ్‌తో బిజీగా ఉన్నాడు. అప్పుడు వేలాడిన కొండచిలువ తిరిగి పైకప్పుకి చేరుకుని దూలానికి చుట్టుకుంటూ వెళ్ళుతుంది. మీటింగ్ తో బిజీగా ఉన్న వ్యక్తికీ ఎటువంటి హాని చేయకుండా వెళ్ళిపోయింది. అప్పుడు ఇది కార్పెట్ పైథాన్ అని చెప్పాడు. మీటింగ్ లో ఉన్న వ్యక్తి పేరు ఆండ్రూ వర్డ్.. ఈ సంఘటన ఆస్ట్రేలియాలోని సిడ్నీలో చోటు చేసుకుంది.

వీడియో చూడండి

ఇవి కూడా చదవండి

ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ యూట్యూబ్‌లో ది స్ట్రాటజీ గ్రూప్ అనే IDతో షేర్ చేశారు. రెండు నిమిషాల 23 సెకన్ల ఈ వీడియోకి ఇప్పటి వరకు వేలాది వ్యూస్ ని సొంతం చేసుకుంది.

కార్పెట్ పైథాన్ ఎంత ప్రమాదకరమైనదంటే?

కార్పెట్ పైథాన్‌లు మధ్యస్థ-పరిమాణ కొండచిలువలు. ఇవి 6 అడుగుల నుండి 12 అడుగుల పొడవు వరకు ఉంటాయి. దాదాపు 2.5 నుండి 3 సంవత్సరాలు జీవిస్తాయి. ఈ పాములు విషపూరితం కావు అయితే..  ప్రమాదకరమైనవి. ఈ కొండచిలువ ఎవరినైనా పట్టుకుంటే.. విడిపించుకోవడం అత్యంత కష్టం. మెడకు బలంగా చుట్టుకుని ప్రాణాలను తీస్తుంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..