Viral Video: నమ్మండి నిజమే… ట్రైన్‌ను నెట్టిన ప్రయాణికులు.. ఎందుకంటే..?

మొరాయించిన ఆర్టీసీ బస్సులను లేదా ఇతర  ప్రైవేట్‌ వాహనాలను కొన్నిసార్లు ప్యాసింజర్లే పక్కకు నెట్టడం మనం చూశాం. వాహనాలను స్టార్ట్ చేసేందుకు కూడా ఈ పద్దతిని ఉపయోగిస్తారు.

Viral Video: నమ్మండి నిజమే... ట్రైన్‌ను  నెట్టిన ప్రయాణికులు.. ఎందుకంటే..?
Viral Video

Updated on: Mar 05, 2022 | 5:40 PM

Trending Video: మొరాయించిన ఆర్టీసీ బస్సులను లేదా ఇతర  ప్రైవేట్‌ వాహనాలను కొన్నిసార్లు ప్యాసింజర్లే పక్కకు నెట్టడం మనం చూశాం. వాహనాలను స్టార్ట్ చేసేందుకు కూడా ఈ పద్దతిని ఉపయోగిస్తారు. గేర్‌లో ఉంచి.. క్లచ్ మూసి.. కొంత దూరం కదిలాక క్లచ్ వదిలితే ఆటోమేటిక్‌గా వాహనం స్టార్ట్ అవుతంది.  అంతేందుకు మొన్నటికి మొన్న ఏకంగా విమానాన్నే నెట్టి మరీ స్టార్‌ చేశారు ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది. అయితే తాజాగా కొంతమంది ప్రయాణికులు.. పట్టాలపై ఉన్న ట్రైన్‌ను నెట్టారు. పట్టు రా పట్టు హైలెస్సా అంటూ ట్రైన్‌ను నెట్టారు. ఇంతకీ… ఇలా ఎందుకు చేశారో తెలుసా..?. మీరట్‌ సమీపంలో ఉన్న దౌరాలా రైల్వే స్టేషన్‌లో షహరాన్‌పూర్‌, ఢిల్లీ(Delhi) మధ్య నడిచే రైలులో మంటలు వ్యాపించాయి. రైలు ఇంజిన్‌లో మంట‌లు చెల‌రేగ‌డంతో.. ప్ర‌యాణికులు ఆ రైలును నెట్టుకుంటూ వెళ్లారు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌(Uttar Pradesh)లో జ‌రిగింది. ఆ ట్రైన్ ఇంజిన్‌తో పాటు, దాని ప‌క్క‌నే ఉన్న రెండు బోగీల్లో మంట‌లు భ‌గ్గుమ‌న్నాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌యాణికులు అల‌ర్ట్ అయ్యారు. త‌క్ష‌ణ‌మే ట్రైన్ దిగిన జ‌నం అంతా.. ఆ రైలును ఇంజిన్ నుంచి, మంటలు చెలరేగిన బోగీల నుంచి వేరు చేసి వెన‌క్కి తోశారు. అది అనమాట అసలు సంగతి. ఆ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.

Also Read: Telangana: కంప్లైంట్ ఇచ్చేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన 3వ తరగతి బుడ్డోడు.. రీజన్ తెలిస్తే అవాక్కే

Loading...
Unable to load recommendations.
Follow Us