Viral News: ఎంత ఆకలేస్తే మాత్రం ఇలా కూడా చేస్తారా.. ఓ రెస్టారెంట్‌లో వెయిటర్‌ వింత ప్రవర్తన..

రెస్టారెంట్లలో కస్టమర్లను ఆప్యాయంగా పలకరిస్తూ.. వారికి ఏమి కావాలో అడిగి తెలుసుకుని.. వారి పట్ల ఎంతో మర్యాదగా ప్రవర్తిస్తుంటారు. సాధారణంగా ఎక్కడైనా ఇలాంటి ఘటనలు చూస్తూ ఉంటాం. ఒకవేళ కోపంతో ఉన్నా.. ఆ కోపాన్ని కస్టమర్లపై..

Viral News: ఎంత ఆకలేస్తే మాత్రం ఇలా కూడా చేస్తారా.. ఓ రెస్టారెంట్‌లో వెయిటర్‌ వింత ప్రవర్తన..
Food Supply In Restaurant

Updated on: Jan 10, 2023 | 4:58 AM

రెస్టారెంట్లలో కస్టమర్లను ఆప్యాయంగా పలకరిస్తూ.. వారికి ఏమి కావాలో అడిగి తెలుసుకుని.. వారి పట్ల ఎంతో మర్యాదగా ప్రవర్తిస్తుంటారు. సాధారణంగా ఎక్కడైనా ఇలాంటి ఘటనలు చూస్తూ ఉంటాం. ఒకవేళ కోపంతో ఉన్నా.. ఆ కోపాన్ని కస్టమర్లపై చూపించరు. కాని తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఓ వీడియో మాత్రం భలే వెరైటీగా ఉంది. కస్టమర్లపై ఓ రెస్టారెంట్‌ వెయిటర్ ప్రవర్తన చూసి అంతా ముక్కు మీద వేళ్లు వేసుకుంటున్నారు. ఈ వీడియోను ఆహారాన్ని మాకు ఈ విధంగా అందించారంటూ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. కరెన్స్ డైనర్ అనే రెస్టారెంట్ కు అమెరికాతో పాటు ప్రపంచంలోని పలు చోట్ల బ్రాంచిలున్నాయి. బర్గర్‌లకు ఈ రెస్టారెంట్‌ ప్రసిద్ధి చెందింది. ఆస్ట్రేలియాలోని ఈ గ్రూపునకు చెందిన ఓ రెస్టారెంట్‌లో కస్టమర్‌తో వెయిటర్‌ ప్రవర్తించిన తీరు వైరల్‌ అవుతోంది. 15 సెకన్ల నిడివి గల వీడియోలో ఒక ఉద్యోగి బర్గర్‌లు, ఆనియన్‌ రింగ్స్‌, చిప్స్ ఆర్డర్‌ ఇస్తాడు. వాటిని తీసుకుని వెయిటర్‌ కస్టమర్ వద్దకు వస్తుంది. అయితే తన చేతిలో వస్తువులను బల్లపై విసిరేస్తూ.. ఆనియన్‌ ఫింగర్స్‌లో ఒకటి తీసుకుని.. టెస్ట్‌ చేస్తూ వెళ్లిపోతుంది.

ఆర్డర్‌ ఇచ్చిన తర్వాత ఫుడ్‌ కోసం గంట సేపు నిరీక్షించిన తర్వాత.. కస్టమర్‌ ఓ వింత అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. ఈ వీడియోను ట్విట్టర్‌లో దాదాపు 50 లక్షల మందికి పైగా వీక్షించారు. అంతేకాదు ఈ వీడియోపై నెటిజన్లు తమదైన స్టైల్‌లో కామెంట్స్‌ చేస్తున్నారు. ఇదేం పనంటే కొందరు అంటుంటే.. రుచి చూసినట్లుందని మరి కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..