Viral Video: హైవేపై చిరుతకు ప్రమాదం.. కోపంతో కారుపై పంజా విసిరి.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

|

Jun 21, 2022 | 5:10 PM

చిరుతపులులు, ఎలుగుబంట్లు, వన్యమృగాలు అప్పుడప్పుడూ జనావాసాల్లోకి వచ్చే ఘటనలు మనం చూస్తూనే ఉంటాం. వాటి ఆవాసాలను ఆక్రమించుకోవడం, అడవులను నరకివేయడం వంటి కారణాలతో అవి తరచూ ఇబ్బందులకు గురవుతూ ఉంటాయి...

Viral Video: హైవేపై చిరుతకు ప్రమాదం.. కోపంతో కారుపై పంజా విసిరి.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే
Leopard Accident Video
Follow us on

చిరుతపులులు, ఎలుగుబంట్లు, వన్యమృగాలు అప్పుడప్పుడూ జనావాసాల్లోకి వచ్చే ఘటనలు మనం చూస్తూనే ఉంటాం. వాటి ఆవాసాలను ఆక్రమించుకోవడం, అడవులను నరకివేయడం వంటి కారణాలతో అవి తరచూ ఇబ్బందులకు గురవుతూ ఉంటాయి. తాజాగా.. సోషల్ మీడియాలో(Leopard) ఓ వీడియో తెగ వైరల్(Viral Video) అవుతోంది. రోడ్డు దాటుతున్న చిరుత ప్రమాదానికి గురైంది. కారు వేగంగా ఢీ కొట్టడంతో చిరుతకు తీవ్ర గాయాలయ్యాయి. కారు బానెట్‌ కింద ఇరుక్కుపోయి తీవ్ర ఇబ్బంది పడింది. ఈ వీడియోను బాలీవుడ్ నటి రవీనా టాండన్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. చిరుతను రక్షించేందుకు కారు డ్రైవర్ కారును వెనక్కి లాగినప్పుడు, చిరుత తన కోపాన్ని వ్యక్తం చేస్తూ కారుపై దాడి చేసింది. వాహనంతోపాటు కొంత దూరం ఈడ్చుకెళ్లింది. కొద్దిసేపటి తర్వాత చిరుత ఎలాగోలా తప్పించుకుని, అక్కడి నుంచి పారిపోయింది.

ఈ వీడియో ఇంటర్నెట్‌లో తుఫానుగా మారింది. వేలాది వ్యూస్‌ని సాధించింది. చిరుతపులి గాయపడటాన్ని చూసి తట్టుకోలేకపోయానని ఒకరు, చిరుతపులికి ఎటువంటి గాయాలు కాకూడదని ఆశిస్తున్నట్లు మరొకరు కామెంట్లు చేశారు. మరోవైపు.. గతేడాది గురుగ్రామ్ సమీపంలోని పాలి-సూరజ్‌కుండ్ రహదారిపై రెండేళ్ల చిరుతపులి చనిపోయింది. శవపరీక్ష నివేదికల ఆధారంగా దానిని వాహనం ఢీకొట్టి ఉండవచ్చని నిర్ధరించారు. దీంతో హైవేలపై అండర్‌పాస్‌ల నిర్మాణం వంటివి చేపట్టి, వన్యప్రాణులు ప్రమాదాలకు గురవకుండా చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..