మొసలికి నీటిలో ఉన్నప్పుడు బలమెక్కువ అంటారు. అలాగని గట్టు మీద ఉన్నప్పుడు దానిని తక్కువ అంచనా వేశారో ఇదిగో ఇలాగే ఇరుక్కుపోతారు. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి వైరల్ అవుతోంది. ఓ అడవి పక్కన ఉన్న చెరువు గట్టుమీద ఒక పెద్ద మొసలి సేదదీరుతోంది. ఇంతలో ఒక టూరిస్ట్ వచ్చి దాంతో ఆడుకోవాలని ట్రై చేశాడు. దాని తలపైన తట్టాలనుకున్నాడు. దాంతో అతన్ని మొసలి చిన్నగా భయపెట్టింది. అయినా వదలకుండా మరోసారి ప్రయత్నిస్తుంటే… గురిచూసి ఆ మొసలి అతని చేతిని లటక్కున నోట కరచింది. మొసలి అలా కరిస్తే చెయ్యి విరగాల్సిందే తప్ప అంత ఈజీగా వదలదు. ఎలాగైనా వదిలించుకోవాలి అనుకున్న అతను… తన చెయ్యిని వెనక్కి లాక్కోవాలని ట్రై చేసినా మొసలి వదల్లేదు. దాంతో మొసలి వీపుపైకి ఎక్కి… దాన్ని కదలనివ్వకుండా చేసేందుకు ప్రయత్నించాడు. దాంతో మొసలి అతని చేతిని వదిలేసి.. దూరంగా జరిగింది. దాంతో అతను బతుకు జీవుడా అనుకుంటూ అక్కడ్నుంచి వెళ్లిపోయాడు.
ఇన్‌స్టాగ్రామ్‌లో జనవరి 11, 2022న ఈ వీడియోని అప్‌లోడ్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఒక్క రోజులోనే దీన్ని లక్షల మందికి పైగా నెటిజన్లు వీక్షించారు. మొసలికి అతనిపై దాడి చేసే ఉద్దేశం లేదు కాబట్టే అది అతన్ని వదిలేసింది. లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉండేవి అంటూ నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
వీడియో చూడండి
Also Read: Viral Video: నేరస్తుడితో ప్రేమలో పడిన మహిళా జడ్జ్.. జైల్లోనే లిప్ లాక్.. వీడియో వైరల్