Viral Video: జూ నుంచి తప్పించుకొని షాపింగ్ మాల్‌లో ప్రత్యేక్షమైన భారీ కొండ చిలువ.. షాకింగ్ వీడియో..

|

Jul 09, 2021 | 1:35 PM

12-Foot Snake Escapes Zoo: సాధారణంగా జూలో ఉండే పాములను ఎన్‌క్లోజర్‌లో ఎంతో పకడ్బంధీగా ఉంచుతారు. అయితే.. అలాంటి ఎన్‌క్లోజర్ నుంచి ఓ 12 అడుగుల భారీ కొండచిలువ రెండు రోజుల క్రితం

Viral Video: జూ నుంచి తప్పించుకొని షాపింగ్ మాల్‌లో ప్రత్యేక్షమైన భారీ కొండ చిలువ.. షాకింగ్ వీడియో..
Snake Escapes
Follow us on

12-Foot Snake Escapes Zoo: సాధారణంగా జూలో ఉండే పాములను ఎన్‌క్లోజర్‌లో ఎంతో పకడ్బంధీగా ఉంచుతారు. అయితే.. అలాంటి ఎన్‌క్లోజర్ నుంచి ఓ 12 అడుగుల భారీ కొండచిలువ రెండు రోజుల క్రితం తప్పించుకుంది. రెండు రోజుల నుంచి జూ సిబ్బంది దానిని వెతుకుతూనే ఉన్నారు. కట్ చేస్తే అది ఓ షాపింగ్ మాల్‌లో ప్రత్యేక్షమైంది. ప్రస్తుత ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అమెరికా లూసియానాలోని బ్లూ అక్వేరియం జూ నుంచి రెండు రోజుల క్రితం కారా అనే 12 అడుగుల కొండచిలువ తప్పించుకుంది. పకడ్బంధీగా ఉన్న ఎన్‌క్లోజర్ నుంచి తప్పించుకున్న కారా కోసం.. రెండు రోజుల నుంచి సిబ్బంది, అధికారులు వెతికే ప్రయత్నం చేశారు. జూని మూసివేసి ఉన్నతాధికారులు సైతం రంగంలోకి దిగారు.

ఈ క్రమంలో చివరికి ఒక షాపింగ్‌మాల్‌లో గోడ సీలింగ్‌లో కారా దాక్కున్నట్లు వారికి తెలియడంతో ఆశ్చర్యపోయారు. షాపింగ్‌మాల్‌ నిర్వాహకులు అనుమతితో వారి గోడకున్న సీలింగ్‌ను పగుగొట్టి దాని నుంచి కొండచిలువను బయటికి తీశారు. ఆ కొంచిలువ ఇక్కడే ఉంటే ప్రమాదమని వెంటనే బ్లూ జూ అక్వేరియంకు తరలించారు. అయితే ఈ సారి పటిష్టమైన ఎన్‌క్లోజర్‌లో ఉంచినట్లు జూ అధికారులు తెలిపారు.

వీడియో..


జూ పక్కనే ఉన్న మాల్ ఆఫ్ లూసియానాలోని పైభాగంలో దాని తోక క‌నిపించడంతో.. సిబ్బంది జూ అధికారులకు సమచారం ఇచ్చారు. దీంతో జూ సిబ్బంది ఆ గోడ‌ను కాస్త కూల‌గొట్టి దానిని బ‌య‌ట‌కు తీసినట్లు వెల్లడించారు. ఈ విష‌యాన్ని స‌ద‌రు జూ సిబ్బంది సోష‌ల్ మీడియాలో షేర్ చేసి వెల్లడించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Also Read:

Stress Relief: నిత్యం ఒత్తిడితో సతమతమవుతున్నారా..? అయితే ఈ పద్దతులు పాటించండి..

Zomato: ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ జోమాటో కీలక నిర్ణయం.. త్వరలో ఆన్‌లైన్‌ కిరాణ డెలివరీ సేవలు