వెంజరమూడులో ఓ జంట వెడ్డింగ్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. పెళ్లయిన 8ఏళ్ల తర్వాత వరుడు ఈ ప్రత్యేక బహుమతితో వధువుని ఆశ్చర్యపరిచాడు. అనీష్, డాక్టర్ వైఎస్ రజిత వారి 7ఏడేళ్ల కుమార్తె అమ్ము సాక్షిగా తమ పెళ్లి ప్రమాణాలను పునరుద్ధరించారు. ఈ జంట 29 డిసెంబర్ 2014న పెళ్లి చేసుకున్నారు. రజిత్ ఎంకామ్ చదువుతుండగా, అనీష్ ఒక ప్రవేట్ సంస్థలో పనిచేస్తుండేవాడు. ఆ సమయంలోనే ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని భావించారు. వారి తల్లిదండ్రుల అనుమతి లేకుండా పెళ్లి చేసుకోవడం వారికి ఇష్టం లేదు. అందుకని అనిష్ బంధువులు రజిత తల్లిదండ్రులను కలిశారు. అయితే, ఈ పెళ్లిని రజిత కుటుంబీకులు వ్యతిరేకించారు. కానీ, ఓ కండిషన్ పెట్టారు. ఎలాంటి పెళ్లి ఆచరాలు లేకుండా రజితను కట్టుబట్టలతో ఇంటికి తీసుకెళ్లాలని అనీష్ బంధువులను కోరారు. దాంతో ఆ మరుసటి రోజే అనీష్ తల్లి, సోదరి కలిసి వచ్చి రజితను తమ ఇంటికి తీసుకెళ్లారు. సాయంత్రం కీజాయికోణంలోని ఓ ఆడిటోరియంలో వరుడి స్నేహితులు, బంధువుల సమక్షంలో అనీష్, రజిత సింపుల్‌గా పెళ్లి చేసుకున్నారు.
జీవితంలో విజయం కోసం వారి పోరాటానికి అది నాంది. తనకు వచ్చే కొద్దిపాటి ఆదాయంతోనే రజిత ఉన్నత చదువులకు ఆసరాగా నిలిచాడు అనీష్. ఆమె కామర్స్‌లో పీహెచ్‌డీ చేసి కిలిమనూరులోని ఓ ప్రైవేట్ కాలేజీలో గెస్ట్ లెక్చరర్‌గా పనిచేసింది. అయితే, రజితలో ఏదో తెలియని అసంతృప్తి కనిపించేది. ఎప్పుడు ఏ పెళ్లి వేడుకల్లో పాల్గొన్నా భార్య మొహం దుఃఖంతో వాలిపోవడం గమనించాడు అనీష్. ఆమె కలర్‌ఫుల్ ఈవెంట్స్‌ని, అలాంటి సన్నివేశాల ఆనందాన్ని చూస్తూ కలత చెందుతుందని అతనికి అర్థమైంది. వారు పారిపోకపోయినా, అనీష్ బంధువుల ఆశీర్వాదంతోనే వివాహం చేసుకున్నప్పటికీ, అందమైన వధువుగా అలంకరించుకోవాలనేది రజిత కల. తనకు ఇంత నిరాడంబరమైన పెళ్లి రోజు రావడం తన విధి అని కూడా ఆమె నమ్ముతుండేది.
వారి పెళ్లి రోజున అన్నీ ఫోటోలు, వీడియోలలో రజిత విచారంగా, దిగులుగా కనిపించింది. అయితే, ఆ జ్ఞాపకాలు ప్రత్యేకంగా ఉండటంతో ఈ జంట ఆల్బమ్‌ను అలాగే ఉంచారు. ఆ ఫోటోలను చూసినప్పుడల్లా తమకెంతో బాధగా ఉంటుందని అంటున్నారు. అనీష్ తన భార్య కోసం ఎదురుచూస్తున్న అందమైన, మరపురాని పెళ్లి రోజును ఎలా బహుమతిగా ఇవ్వాలో అర్థం కాలేదు. రచయిత, సామాజిక కార్యకర్త అయిన అనీష్ తన గందరగోళాన్ని తోటి సామాజిక కార్యకర్త మీరా అజిత్‌కుమార్‌తో పంచుకున్నారు. దాంతో ఆమె ఓ గ్రేట్ ఐడియా ఇచ్చింది. వెంటనే వారికి వెడ్డింగ్ ఫోటోషూట్ కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. అనీష్ ,రజిత వధూవరులుగా ముస్తాభయ్యారు. కానీ, ఈ సారి మాత్రం రజిత ముఖంలో చిరునవ్వు మెరిసింది. తిరువనంతౌరంలోని అట్టుకల్ దేవాలయం, శంకుముఖం బీచ్‌తో సహా వివిధ ప్రదేశాలలో సేవ్‌ది డేట్, ప్రీ అండ్ పోస్ట్ వెడ్డింగ్ ఫోటో షూట్ జరిగింది. థీసెస్ అందంగా తీసిన ఫోటోలు డిజిటల్ ఆల్బమ్‌గా మారాయి. ఆ జంట ఎప్పటికీ గుర్తుపెట్టుకునేలా ఆల్బమ్ తయారైంది. అంతేకాదు, సోషల్ మీడియాలో కూడా ఈ ఫోటోలు సూపర్ హిట్ అయ్యాయి.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి