Viral News: నదిలో చేపల కోసం వల విసిరిన జాలర్లు.. అందులో చిక్కింది చూసి షాక్..

|

Sep 05, 2021 | 6:45 PM

వారు రోజూ చేపలు పట్టేందుకు వెళ్తారు.  ఆ రోజు కూడా ఎప్పట్లానే సరంజామా సర్దుకుని నది వద్దకు వెళ్లారు. ఎప్పటిలాగే వలకు పట్టిన చిక్కులు తీసి అంతా సెట్ చేసుకున్నారు.

Viral News: నదిలో చేపల కోసం వల విసిరిన జాలర్లు.. అందులో చిక్కింది చూసి షాక్..
Fishing
Follow us on

వారు రోజూ చేపలు పట్టేందుకు వెళ్తారు.  ఆ రోజు కూడా ఎప్పట్లానే సరంజామా సర్దుకుని నది వద్దకు వెళ్లారు. ఎప్పటిలాగే వలకు పట్టిన చిక్కులు తీసి అంతా సెట్ చేసుకున్నారు. వలను అటు కొంతమంది .. ఇటు కొంత మంది పట్టుకొని నదిలోకి వెళ్లారు. అలాగే కాసేపు వలను అటూ.. ఇటూ.. కదిలిస్తూ చేపలను అందులో పడే విధంగా తోచిన ప్రయత్నాలు చేశారు. కొంత టైమ్ తర్వాత వల బయటకు తీయడం ప్రారంభించారు.  కొంచెం కష్టంగా అనిపిస్తుంది. జల పుష్పాలు గట్టిగానే చిక్కాయని ఆనందపడ్డారు. కానీ బరువు ఊహించనదాని కంటే ఎక్కువ ఉంది. దీంతో వారికి సమ్‌థింగ్ తేడా కొడుతున్నట్లు అనిపించింది. తినబోతు రుచి ఎందుకు అని.. వలను త్వరగా  బయటకు గుంజడం మొదలు పెట్టారు. వచ్చిన వారంతా తలా చెయ్యి వేసి వలను ఎట్టకేలకు బయటకు లాగారు. చేపల కొసమంటూ ఆ వల సమీపంలోకి వెళ్లిన మత్స్యకారులకు ఊహించని షాక్‌ తగిలింది.

అందులో చిక్కినదానిని చూసి వారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే అక్కడ నుంచి పరుగులు తీశారు. ఆ వలలో పడింది ఎంటో తెలుసా ‘విచిత్రమైన’  మొసలి లాంటి ఓ జీవి. మొసలి అయినా కూడా వారు పెద్దగా కంగారు పడే వారు కాదు. కానీ ఇది కొంచెం తేడాగా ఉండటంతో ఆందోళన చెందారు.  బీహార్‌ బెగుసరాయ్ జిల్లాలోని ఖోడ్‌బంద్‌పూర్ బ్లాక్ ప్రాంతంలోని పాత గండక్ నదిలో ఫిషింగ్ నెట్‌ ఈ విచిత్రమైన జీవి చిక్కింది. దీన్ని స్థానిక వెబ్‌సైట్ ‘వింతైన జీవి’ అంటూ వార్తను ప్రచురించింది. ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ కస్వాన్ ప్రవీణ్ కస్వాన్ చిత్రాన్ని రీ-షేర్ చేసాడు. ఆ జీవి గురించి క్లారిటీ ఇచ్చారు. అది విచిత్రమైన జీవి ఏమి కాదని..ఇది మొసలి లాంటి ఓ సరీసృపం అని చెప్పారు. ఇలాంటి జీవులు గండక్, చంబల్, గంగా, రామగంగా, గీర్వా, యమున వంటి అనేక నదులలో కనిపిస్తాయని చెప్పారు.

Also Read: దిశ ఘటనలో ఊహించని ట్విస్ట్.. బాలీవుడ్, టాలీవుడ్‌కు చెందిన 38 మంది సినీ ప్రముఖులపై కేసు

ఇంజిన్ లేదు, ఇంధ‌నం అవ‌స‌రం లేదు.. అయినా 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం