Viral Video: ప్లాట్‌ఫామ్‌ మీదే పొట్టుపొట్టుగా కొట్టుకున్న వందేభారత్‌ సిబ్బంది..! షాకింగ్‌ వీడియో వైరల్‌..

నిన్నమొన్నటి వరకు బస్సుల్లో కొట్టుకున్న ఆడవాళ్ల వీడియోలు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్‌ కావడం చూశాం. అలాగే, అప్పుడప్పుడు రైళ్లలో కూడా ఇలాంటి గొడవలు, కొట్టుకోవటం కూడా చూస్తుంటాం. కానీ, మీరు ఎప్పుడైన రైల్వే సిబ్బంది ప్లాట్‌ఫామ్‌లపైనే తన్నుకోవటం చూశారా..? ఇందుకు సంబంధించి వీడియో ప్రస్తుతం ఇంటర్‌నెట్‌లో వైరల్‌ అవుతోంది. ఇందులో IRCTC సిబ్బంది ఒక చిన్న విషయంలో ఏర్పడిన గొడవ కారణంగా పొట్టుపొట్టుగా కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో, సిబ్బంది ఒకరిపై ఒకరు డస్ట్‌బిన్, బెల్ట్‌లతో కొట్టుకోవడంతో పాటు పిడిగుద్దులు కురిపించుకున్నారు.

Viral Video: ప్లాట్‌ఫామ్‌ మీదే పొట్టుపొట్టుగా కొట్టుకున్న వందేభారత్‌ సిబ్బంది..! షాకింగ్‌ వీడియో వైరల్‌..
Vande Bharat Staff Fight

Updated on: Oct 18, 2025 | 9:45 AM

దేశ రాజధాని ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. IRCTC సిబ్బంది ఒక చిన్న విషయంలో ఏర్పడిన గొడవ కారణంగా పొట్టుపొట్టుగా కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో, సిబ్బంది ఒకరిపై ఒకరు డస్ట్‌బిన్, బెల్ట్‌లతో కొట్టుకోవడంతో పాటు పిడిగుద్దులు కురిపించుకున్నారు. వందేభారత్ రైలు స్టేషన్ నుంచి బయలుదేరడానికి కొద్దిసేపటి ముందు ఈ గొడవ జరిగింది. ఈ ఘటన అక్కడ ఉన్న ప్రయాణికులను ఆందోళనకు గురి చేసింది.

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సిబ్బంది మధ్య జరిగిన ఘర్షణ ఎంత తీవ్రంగా ఉందంటే, ఆ వీడియో ఇంటర్నెట్‌లో దావానలంలా వ్యాపించింది. శుక్రవారం ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌లోని ఖజురహో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో క్యాటరింగ్ సిబ్బంది మధ్య జరిగిన గొడవ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ గొడవ ప్లాట్‌ఫామ్‌పై బెల్టులు, చెత్తబుట్టలు, తన్నులు, పంచ్‌లతో తారా స్థాయికి చేరుకుంది. వారి గొడవ ప్లాట్‌పామ్‌పై యుద్ధవాతావరణాన్ని సృష్టించింది. సోషల్ మీడియాలో ప్రజలు దీనిని బాగ్‌పత్ 2.0 వార్‌ అని పిలుస్తున్నారు. అంటే 2021లో ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో వైరల్ అయిన అదే ప్రసిద్ధ చాట్ యుద్ధం.

ఇవి కూడా చదవండి

అక్టోబర్ 17న @theskindoctor13 అనే హ్యాండిల్ ద్వారా Xలో షేర్ చేయబడిన పోస్ట్ ఇలా ఉంది, వందే భారత్ క్యాటరింగ్ సిబ్బంది బాగ్‌పత్ యుద్ధం స్టైల్లో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు అంటూ వీడియోని షేర్‌ చేశారు. కాగా, ఈ పోస్ట్‌కు ఇప్పటికే 7.5 వేల లైక్‌లు, 381 వేల వ్యూస్, వందలాది రియాక్షన్‌లు వచ్చాయి.

ఢిల్లీ పోలీసుల కథనం ప్రకారం, వాస్తవానికి రైలులోని వాటర్ బాక్స్ విషయంలో గొడవ ప్రారంభమైంది. ఖజురహో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్యాంట్రీ అసిస్టెంట్ల మధ్య వాటర్ బాక్స్ ఉంచడంపై వివాదం తలెత్తింది. అది క్రమంగా ఘర్షణకు దారితీసింది. అయితే, ఇరు వర్గాల్లో ఎవరూ అధికారికంగా ఫిర్యాదు చేయలేదు. తరువాత, రెండు పార్టీలు రాతపూర్వకంగా ఈ విషయాన్ని సామరస్యంగా పరిష్కరించుకున్నాయి అని పోలీసులు తెలిపారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత తాము దానిని సుమోటోగా తీసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ విషయం రైల్వే చట్టం కిందకు వస్తుంది కాబట్టి, హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ పోలీస్ స్టేషన్‌లో 17/10/2025 నాటి ఎఫ్‌ఐఆర్ నంబర్ 74/25, సెక్షన్ 194(2) బిఎన్‌ఎస్ కింద కేసు నమోదు చేయబడింది.

వీడియో ఇక్కడ చూడండి..

ఈ సంఘటనపై బలమైన వైఖరిని తీసుకుంటూ, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపింది. నలుగురు ఉద్యోగులను విధుల నుండి తొలగించి, వారి ID కార్డులను రద్దు చేశారని తెలిసింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..