Viral Video: నదిలో కొట్టుకుని పోతున్న యువకుడిని ప్రాణాలకు తెగించి కాపాడిన పోలీసులు.. నెటిజన్లు ప్రశంసల వర్షం..

|

Jul 16, 2022 | 1:20 PM

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక యువకుడు .. వేగంగా ప్రవహిస్తోన్న నదిలో చిక్కుకున్నాడు. ఒడ్డుకు చేరుకోవడానికి కష్టపడుతున్నాడు. అయితే ఒక పోలీసు అధికారి నదిలో చిక్కుకున్న యువకుడి వైపు వేగంగా ఈదుతూ కనిపించారు.

Viral Video: నదిలో కొట్టుకుని పోతున్న యువకుడిని ప్రాణాలకు తెగించి కాపాడిన పోలీసులు.. నెటిజన్లు ప్రశంసల వర్షం..
Uttarakhand Police Viral Vi
Follow us on

Viral Video: సోషల్ మీడియాలో వరదలకు, నదుల ఉగ్ర రూపంతో ప్రవహిస్తోన్న వీడియో వైరల్ అవుతున్నాయి. తాజాగా  నది ప్రవాహంలో ఈదలేక కొట్టుకున్న పోతున్న యువకుడిని ప్రాణాలకు తెగించి మరీ పోలీసులు కాపాడారు. వీరి సాహసం పలువురి నెటిజన్ల హృదయాలను ఆకట్టుకుంది. . ఈ వీడియో క్లిప్‌లో ఉత్తరాఖండ్ కు చెందినపోలీసులు నదిలో మునిగిపోకుండా ఒక యువకుడిని రక్షించారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు వీరి.. సాహసం పలువురి ప్రశంసలను పొందుతోంది.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక యువకుడు .. వేగంగా ప్రవహిస్తోన్న నదిలో చిక్కుకున్నాడు. ఒడ్డుకు చేరుకోవడానికి కష్టపడుతున్నాడు. అయితే ఒక పోలీసు అధికారి నదిలో చిక్కుకున్న యువకుడి వైపు వేగంగా ఈదుతూ కనిపించారు. అధికారి నది ప్రవాహంలో కొట్టుకుని పోతున్న వ్యక్తిని పట్టుకున్నాడు.. అదే సమయంలో మరో ఇద్దరు వ్యక్తులు నదిలో దూకి.. వేగంగా ఈదుకుంటూ.. ఆ ఇద్దరి దగ్గరకు చేరుకున్నారు. చివరకు నదిలో కొట్టుకుని పోతున్న వ్యక్తిని సురక్షితంగా బయటకు తీసుకుని వచ్చారు. ఈ ఘటన కాంగ్రా ఘాట్‌లోని రావత్‌పూర్ భవన్ సమీపంలో చోటు చేసుకుంది. బాధితుడిని కాపాడిన ఇద్దరు అధికారులు అతుల్ సింగ్, సన్నీ కుమార్‌లుగా గుర్తించారు.

ఇవి కూడా చదవండి

రెస్క్యూ  వీడియోను షేర్ చేసిన పోలీస్ డిపార్ట్‌మెంట్.. హరిద్వార్ – రావత్‌పూర్ భవన్, కాంగ్రా ఘాట్ సమీపంలో యువకుడు మునిగిపోతున్నట్లు చూసి ఉత్తరాఖండ్ పోలీలైన అతుల్ సింగ్ , సన్నీ కుమార్ లు నదిలోకి దూకి యువకుడిని సురక్షితంగా బయటకు తీసుకుని వచ్చారు. అతని ప్రాణాలను రక్షించారు .. బాధిత యువకుడు హర్యానాలోని సోనిపట్ నివాసని పేర్కొన్నారు.

ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంది.  భారీ సంఖ్యలో వ్యూస్, అనేక లైక్‌లు, రీట్వీట్‌లతో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఒక మనిషి ప్రాణాలు రక్షించడం ఉత్తరాఖండ్‌ పోలీసులు చేసిన గొప్ప పని..  పోలీసులు హీరోగా మారడం ఇదే! మీ ఇమేజ్‌ని కొనసాగించండి” అంటూ కామెంట్ చేశారు.  పోలీసుల సాహసం అద్భుతం. ఇద్దరూ అవార్డుకు అర్హులని కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..