Viral News: కోడిపుంజుకు దశదినకర్మ.. 500 మందికి భోజనాలు.. దాని త్యాగం తలచుకుని ఏడ్చిన యజమాని..!

మృతిచెందిన కోడికి సంప్రదాయబద్దంగా అంత్యక్రియలు నిర్వహించడమే కాకుండా దశదిన కర్మ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. కుటుంబీకులు చేసిన ఈ పని స్థానికంగానే కాకుండా జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Viral News: కోడిపుంజుకు దశదినకర్మ.. 500 మందికి భోజనాలు.. దాని త్యాగం తలచుకుని ఏడ్చిన యజమాని..!
Rooster

Updated on: Jul 23, 2022 | 6:40 PM

Viral News:  కోడిపుంజుకు దశదినకర్మ నిర్వహించడమే కాకుండా 500 మందికి భోజనాలు కూడా పెట్టారు. ఇలాంటి విచిత్ర సంఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. యూపీలోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో జరిగిన ఈ తంతంగాన్ని చూసిన స్థానికులు ఆశ్చర్యపోయారు. ప్రతాప్‌గఢ్‌కు చెందిన ఓ కుటుంబం తమ పెంపుడు కోడి చనిపోవడంతో రోదిస్తున్నారు. సంప్రదాయబద్దంగా అంత్యక్రియలు నిర్వహించడమే కాకుండా దశదిన కర్మ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. కుటుంబీకులు చేసిన ఈ పని స్థానికంగానే కాకుండా జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే, ఈ కోడి మృతి వెనుక కారణం తెలిసి అందరూ ఆ కోడిని కొనియాడుతున్నారు. అసలు విషయంలోకి వెళితే..

ఈ వింత ఘటన ప్రతాప్‌గఢ్ జిల్లాలోని ఫతాన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధి బెహదౌల్ కలాన్ గ్రామంలో జరిగింది. ఆ కోడి పేరు లాలీ.. అయితే ఓ రోజు ఆ కోడి పుంజు.. ఒక నెల వయసున్న గొర్రె పిల్లను తన ప్రాణాలకు తెగించి కాపాడింది. గొర్రెపిల్లపై వీధికుక్క దాడి చేస్తుండగా కోడి గమనించి అడ్డుకుంది. వీధి కుక్కతో వీరోచితంగా పోరాడిన కోడి చివరకు తన ప్రాణాలనే కోల్పోయింది. కానీ, ఆ గొర్రెపిల్ల కుక్కదాడి నుంచి సురక్షితంగా రక్షించబడింది. దాని త్యాగం, ప్రేమ చూసిన ఆ కుటుంబం ఆ కోడిపుంజుకు అంత్యక్రియలు నిర్వహిచింది. అంతేకాకుండా చనిపోయిన కోడిపుంజుకు దశదినకర్మను కూడా నిర్వహించింది. పదవ రోజున స్థానికులు, బంధుమిత్రులను దాదాపు 500 మందిని పిలిచి భోజనాలు కూడా పెట్టించారు. జూలై 7న జరిగింది. బహదూర్ లాలీ యజమాని సాలిక్రమ్ సరోజ్ కోడికి అంత్యక్రియలు, దశదినకర్మ నిర్వహించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి