US Smuggler Caught With 60 Snakes, Lizards: విషపూరిత జీవులను చూస్తేనే భయంతో వణికిపోతాం. అయితే, ఓ వ్యక్తి వాటిని తన దుస్తుల్లో దాచిపెట్టి దేశాలనే దాటిస్తూ అడ్డంగా దొరికిపోయాడు. ఓ వ్యక్తి తన ప్యాంటులో 60 రకాల పాములు, బల్లులు, ఇతర సరిసృపాలను స్మగ్లింగ్ చేస‍్తుండగా అధికారులు పట్టుకున్నారు. ఈ షాకింగ్ సంఘటన అమెరికా- మెక్సికో సరిహద్దులో చోటుచేసుకుంది. స్మగ్లింగ్‌ను పసిగట్టిన అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 7,50,000 డాలర్ల విలువైన సరిసృపాల స్మగ్లింగ్ చేస్తుండగా.. చాకచక్యంగా పట్టుకున్నారు. దీనిలో భాగంగా వాటన్నింటిని ప్యాంటులో పెట్టుకుని అమెరికాలోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అతడి దుస్తులు మొత్తం విప్పి అధికారులు క్షుణ్ణంగా పరిశీలించగా ప్యాంటులో 60 పాములు, బల్లుల వంటివి దొరికినట్లు అధికారులు తెలిపారు..
దక్షిణ కాలిఫోర్నియాకు చెందిన జోస్ మాన్యుయెల్ పెరెజ్ అనే వ్యక్తి ఆరేళ్లలో 1,700 జంతువులను.. మెక్సికో, హాంకాంగ్‌ల నుంచి అమెరికాకు స్మగ్లింగ్ చేసినట్లు ఒప్పుకున్నట్లు అధికారులు తెలిపారు. అతని అక్రమ రవాణా ఈ ఏడాది మార్చిలో బట్టబయలైందని పేర్కొన్నారు. నిందితుడు జోస్ పెరెజ్ గతంలోనూ గాడిదలతో కూడా సరిహద్దులు దాటించినట్లు ఒప్పుకున్నాడని పేర్కొన్నారు. అందులో యుకాటాన్ బాక్స్ తాబేళ్లు, మెక్సికన్ బాక్స్ తాబేళ్లు, పిల్ల మొసళ్లు, మెక్సికన్ పూసల బల్లులు సహా ఇతర అరుదైన జంతువులు ఉన్నాయన్నారు. ఈ రెండు కేసుల్లో స్థానిక కోర్టు అతడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..