
సోషల్ మీడియాలో నిత్యం అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా పెంపుడు జంతువులు, అడవి మృగాలు, పాములు, పక్షులు వంటి ఎన్నో వీడియోలు మనం నిత్యం చూస్తూనే ఉంటాము. అలాగే, కొన్ని చిన్నపిల్లల వీడియోలు కూడా నెటిజన్లు బాగా ఆకట్టుకుంటాయి. పిల్లల అల్లరి, ఆటపాటలు వీడియోలు తీసి ఇంటర్‌నెట్‌లో పోస్ట్ చేస్తుంటారు చాలా మంది. అయితే, కానీ, మీరెప్పుడైన చిన్నపిల్లల స్కూల్లో అమ్మనాన్నల అల్లరిని చూశారా..? అది మామూలు అల్లరి కాదండోయ్..ఏకంగా స్కూల్లోనే అమ్మనాన్నల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది.. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తీవ్ర దుమారం రేపుతోంది.
అమెరికా ఆర్కాన్సాస్‌లోని ఒక ఎలిమెంటరీ స్కూల్‌లో ఇటీవల జరిగిన సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. స్కూల్‌లో గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో పాల్గొన్న చిన్నారుల తల్లిదండ్రుల మధ్య చిన్న వాగ్వాదం పెద్ద ఫైటింగ్‌గా మారింది. ఈ పరిస్థితి చూసిన పిల్లలు భయంతో కన్నీటి పర్యంతమై, గొడవ ఆపాలని పేరెంట్స్‌ను వేడుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున షేర్ అవుతూ వైరల్‌గా మారాయి.
వీడియో ఇక్కడ చూడండి..
NEW: Wild brawl breaks out between parents at an Arkansas kindergarten graduation
Several adults fought in the hallway of West Memphis’ Faulk Elementary
Children nearby screamed in fear as the fight broke out in the crowded corridor
Men and women were involved, with parents… pic.twitter.com/1wcRBCWgjG
— Unlimited L’s (@unlimited_ls) May 30, 2025
మే 28న అర్కాన్సాస్‌లోని వెస్ట్ మెంఫిస్‌లోని ఫాల్క్ ఎలిమెంటరీ స్కూల్‌లో కిండర్ గార్డెన్ స్నాతకోత్సవం సందర్భంగా గందరగోళం చెలరేగింది. ఈ వేడుకకు హాజరైన తల్లిదండ్రల మధ్య గొడవ చెలరేగింది. అది కాస్త చినికి చినికి గాలివానగా మారింది. మహిళల మధ్య చెలరేగిన వాగ్వాదం కొన్ని క్షణాల్లోనే అక్కడ యుద్ధవాతావరణాన్ని సృష్టించాయి. అడ్డుకుందామని ప్రయత్నించిన మగవారు అక్కడి పరిస్థితులకు ఓడిపోవాల్సి వచ్చింది. మరికొందరు మాత్రం పరిస్థితి చేజారేలా ఉందని గ్రహించి వెంటనే అక్కడ్నుంచి వెళ్లిపోయారు. ఇక వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఇలాంటి భిన్నమైన కామెంట్లు చేస్తూ వీడియో మరింత వైరల్‌గా మార్చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..